Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాలకీడు
మండలంలోని బొత్తలపాలెం గ్రామంలోసీజేఎఫ్ నిధుల ద్వారా నిర్మాణం పూర్తి చేసుకుంటున్న దేవాలయాన్ని హుజూర్నగర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గౌతమ్, సెక్షన్ ఆఫీసర్ గోవర్ధన్ సందర్శించారు. రామాలయానికి అవసరమైన ధ్వజస్తంభం ( నార వేప ) అటవీ శాఖ నుండి 50 శాతం రాయితీ తో తెప్పించనున్నట్లు తెలిపారు. దానిలో భాగంగానే అరణ్య భవన్ హైదరాబాద్, సూర్యాపేట అటవీశాఖ కార్యాలయం ఆదేశాల మేరకు గ్రామంలో దేవాలయం వాస్తవ పరిస్థితి, ధ్వజస్తంభం అవసరాన్ని పరిశీలించడానికి వచ్చినట్లు అటవీశాఖ అధికారి గౌతం తెలిపారు. తమ రిపోర్టును జిల్లా అటవీ శాఖ కార్యాల యానికి పంపు తామని.. తదనంతరం తమ కార్యాలయ నిబంధనల మేరకు ధ్వజస్తంభం దేవాల యానికి అందుతుందని ఆలయ కమిటీ సభ్యులకు తెలిపారు.. ఈ కార్యక్రమంలో నిర్మాణ కమిటీ చైర్మన్ భోగాల వీరారెడ్డి, ఉప చైర్మన్ సత్యనారాయణ, వైస్ ఎంపీపీ పిన్నెల్లి ఉపేందర్ రావ్, సభ్యులు అందే వెంకటేశ్వర్లు, లక్ష్మీనారాయణ, రాంబాబు, వీరభద్రం, కష్ణమూర్తి, నరేందర్, అందే రవి, సుధాకర్ రెడ్డి, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.