Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నకిరేకల్
టీఎస్ యూటీఎఫ్ శాలిగౌరారం మండల శాఖ అధ్యక్షుడిగా మహ్మద్ రఫీ శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 317 వల్ల జిల్లాల లొకేషన్లో భాగంగా అధ్యక్షుడిగా పని చేస్తున్న కంబాలపల్లి శ్రీను బదిలీపై యాదాద్రి జిల్లాకు వెళ్లారు. ఈ సందర్భంగా గురువారం రాత్రి నకిరేకల్ టీఎస్ యూటీఎఫ్ భవనంలో శాలిగౌరారం మండల స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉట్కూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మహమ్మద్ రఫీని నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. విద్యా రంగ అభివృద్ధి కోసం, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. సమావేశంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి యాట మధుసూదన్ రెడ్డి, శాలిగౌరారం మండల ప్రధాన కార్యదర్శి రాగి రాకేష్ కుమార్, ఉపాధ్యక్షులు పోతుల దేవయాని, నల్ల చక్రపాణి, కోశాధికారి అల్లం శంకర్, పుట్ట రాములు, చౌగోని యశోద, బొమ్మిడి శ్రీనివాసులు, పుణ్యమూర్తి జయసాగర్, పట్టేటి మల్లేష్, చౌగోని శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.