Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కాంగ్రెస్యాదాద్రిభువనగిరి జిల్లా అధ్యక్షులు అనిల్‌కుమార్‌రెడ్డి
నవతెలంగాణ-భువనగిరిరూరల్
యాదాద్రిభువనగిరి జిల్లాలో అత్యధిక కాంగ్రెస్ సభ్యత్వాలు చేయాలని ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు.శుక్రవారం పట్టణంలోని సంకల్ప హోటల్లో నియోజకవర్గంలోని ఎన్‌రోలర్స్‌తో నియోజకవర్గ సభ్యత్వ నమోదుపై సమీక్షా సమావేశంనిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా నుండి అత్యధిక సభ్యత్వాలు చేయాలని ఎన్రోలర్స్కు సూచించారు.కాంగ్రెస్ దేశ స్వాతంత్య్రసంగ్రామంలో పాల్గొని, దేశ ప్రజలకు బానిస సంకెళ్ల నుంచి విముక్తి కలిగించిందన్నారు.నేడు మతోన్మాదానికి వ్యతిరేకంగా యువత పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.పోరాటాల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌లో పని చేస్తున్నందుకు గర్వపడాలన్నారు. తెలంగాణ రాష్ట్ర కల సహకారం చేసిన సోనియాగాంధీకి తెలంగాణ ప్రజలు రుణపడి ఉన్నారన్నారు.కొందరు రాజకీయ కుట్రలో భాగంగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నామన్నారు.ఈ సమావేశంలో భువనగిరి పట్టణ అధ్యక్షులు బీసుకుంట్ల సత్యనారాయణ, మండల అధ్యక్షులు కోట పెదస్వామి, బీబీనగర్ మండల అధ్యక్షులు పటోల్ల శ్యాంగౌడ్, పోచంపల్లి మండల అధ్యక్షులు పాక మల్లేష్‌యాదవ్, భువనగిరి మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ పోత్నక్ ప్రమోద్‌కుమార్,పోచంపల్లి పట్టణ అధ్యక్షులు రమేష్‌గౌడ్, బ్లాక్ ప్రెసిడెంట్ తడక వెంకటేష్, మాజీ మున్సిపల్ చైర్మెన్ బర్రె జహంగీర్, మాజీ పీసీసీ కార్యదర్శి తంగెల్లపల్లి రవికుమార్, చందుపట్ల బ్యాంక్ చైర్మెన్ మందాడి లక్ష్మీనర్సింహారెడ్డి, మైనారిటీ అధ్యక్షులు బబ్లు, వాకిటి అనంతరెడ్డి, నాయకులు, ఎన్‌రోలర్స్ పాల్గొన్నారు.