Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భువనగిరిరూరల్
జిల్లాకేంద్రంలో జరిగే సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లను భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకష్ణారెడ్డితో కలిసి శుక్రవారం పరిశీలించారు.సభ ఏర్పాట్లను స్వయంగా దగ్గరుండి చేస్తున్నారు.ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా పనులు చేయాలని నిర్వాహకులకు సూచించారు.అనంతరం టీఆర్ఎస్ కార్యాలయాన్ని సందర్శించి ప్రారంభోత్సవపనులను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల సంస్థ చైర్మెన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మెన్ జడల అమరేందర్, జిల్లా రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు కొలుపుల అమరేందర్, వైస్‌ఎంపీపీ సంజీవరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.