Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీఎం డెడ్‌లైన్ 38 రోజులే
అసౌకర్యాలైతే లేవు..కానీ కల్పిస్తరటా..
అ ప్రారంభ దశలో బస్ టర్మినల్..50శాతం బస్ బే పూర్తి
నవతెలంగాణ-యాదాద్రి
యాదాద్రిలో చేపట్టిన అభివృద్ది పనులు ఇంకా పూర్తే కాలే..? వచ్చే నెల 21 నుండి 28 వరకు సీఎం తలపెట్టిన కార్యం సక్సెస్ అవు తుందా..? లేదా..? ఐతే అందరికి మంచిదే.. కాకుంటే మరి ఎట్లా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.సదుపాయాలైతే లేవు..కానీ ఏర్పాటు చేస్తామని అధికారులు చేస్తోన్న హడావిడి చూసి భక్తజనం ముక్కున వేలేసు కుంటున్నారు.ఇట్లా చేసిన పనుల్లో నాణ్యత లోపించదా అని అనుమానాలు వెల్లడవు తున్నాయి.
ఇంకా 38 రోజులే...
లక్షమందికి అన్నం వడ్డిస్తామని గత నెల 21 దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి యాదాద్రిలో ప్రకటించారు..కానీ అందుకు తగ్గట్టుగా వసతులు మాత్రం కల్పించే ప్రయత్నమే కనిపించడం లేదని భక్తజనం అభిప్రాయపడుతోంది.ఇక కొండపైన స్వాగత తోరణం పనులు 70శాతం పూర్తి కాగా కొండకింద అన్నదాన సత్రం, సత్యదేవుని వ్రత మండపం, మొదటి ఘాట్, మూడవ ఘాట్ ఇంకా పూర్తే కాలే..ఈ పరిస్థితి చూసే వారికి అనుమానమే వస్తోంది. కానీ సీఎం కేసీఆర్ మాత్రం గడువు విధించారు. ఇవన్ని పరిగణలోకి తీసుకున్నారా..? లేదా..? అని పలువురు అశ్చర్యపోతున్నారు. సీఎం డెడ్‌లైన్ నేటి నుండి 38 రోజులు మాత్రమే ఉంది. ఇంత తక్కువ టైంలో ఈ పనులు పూర్తి అయ్యేదెప్పుడు..భక్తుల బాధలు తీరేదెప్పుడని పలువురు వాపోతున్నారు.
సామాన్యుల గతి ఏం కాను...
నేడు సీఎం ప్రెసిడెన్షియల్ సూట్ ప్రారంభిస్తే..మరి సామాన్య భక్తులు పరిస్థితి ఏందనే విమర్శలు తలెత్తుతున్నాయి. వీఐపీ ిలకేమో వసతులు..? మరి సామాన్యుల గతి ఏం కావాలే..? అంటూ యాత్రజనులు ప్రశ్నిసు న్నారు.దేవాదాయ శాఖ మంత్రి వెల్లఢించినట్లుగా లక్ష మందికి భోజనాలు వడ్డిస్తే సౌకర్యాలకు ఎటు వెళ్లాలనే ప్రశ్న తలెత్తుతోంది. సాధారణ రోజుల్లోనే బాలాలయంలో స్వామి దర్శనాలకు వచ్చే భక్తులకు అద్దె గదులే దొరకవు. అవసరాలు తీరవు. మరి ఎక్కడ తల దాచుకోవాలే. అవ సరాలు ఎట్లా తీర్చుకోవాలే అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
కొనసాగుతోన్న పనులు...
కాగా కొండపైన ధ్వజస్థంభం, బలి పీఠం తదితరాలకు బంగారు తాపడం పనులు సాగుతున్నాయి. కరెంటు పనులు నత్తనడక సాగుతున్నాయి. ఇంకా సప్తరాజగోపురాల కలప పరంజా, లోహపు క్యూలైన్లు అలాగే ఉండగా అసలు మంచినీళ్లు, మరుగుదొడ్లు, అద్దె గదుల ఊసేలేదు. ఇవన్ని ఇలా ఉండగా గడువు లోపు పూర్తి చేయాలని సీఎం ఎలా పురమా యించారోనని పలువురు విస్తుపోతున్నారు. ఇక కొండంత గ్రీనరి చేయాలని అధికారులు అనుకున్నా..అది కూడా పూర్తే కాలే. ఇక కొండపైన బస్ బే 50శాతం పూర్తి కాగా కొండకింద బస్ టర్మినల్ పిల్లర్ల దశలోనే ఉంది.
అంచనాలు తలకిందులైతే..
కానీ యాగం చేయడానికి 75 ఎకరాలు మాత్రం కేటాయించారు అధికారులు. మరి ఇలాంటి పరిస్థితుల్లో యాగం మొదలు పెడితే..లక్ష మంది ఒక్కసారి వస్తే...అంచనాలు తలకిందులే కదా..! చూడాలి మరి ఏం జరుగుతుందో..!!