Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భువనగిరిరూరల్
రాష్ట్ర ఔషధ నియంత్రణ పరిపాలన విభాగం డైరెక్టర్ ప్రీతి వీణ ఆదేశాలతో కొద్ది రోజులుగా ఉమ్మడి నల్లగొండ జిల్లా మెడికల్ షాపులపై ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నట్టు ఉమ్మడి జిల్లా సహాయ సంచాలకులు ఎం.శ్రీనివాసులు తెలిపారు.శుక్రవారం పట్టణంలోని పలు మెడికల్ షాపులలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు కలిగించే ఔషధాల అమ్మకం, ఫార్మాసిస్టు పర్యవేక్షణలో మందులు అమ్మకం, యాంటీబయోటిక్ మందుల అమ్మకాలు, కొనుగోలు, అమ్మకు బిల్లుల రిజిస్టర్ నమోదు వంటి అంశాలపై విస్తతంగా తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘి ంచిన షాపులపై షోకాజ్ నోటీసులు జారీ చేసి వారి వివరణ తీసుకొని, వివరణ సరిగా లేకుంటే లైసెన్సు సస్పెండ్ చేస్తాన్నారు.ఇక నుంచి నిరంతరం తనిఖీలు జరుగుతాయని నిబంధనలు ఉల్లంఘించిన షాపులపై తీవ్రత బట్టి లైసెన్స్‌ను రద్దు చేయడం గాని, రద్దు పరచడం గాని లేదా కోర్టు కేసు నమోదు చేయడం గాని జరుగుతుందన్నారు. మత్తు కలిగించే మందులు డైజోఫామ్, అల్ట్రా జోలం, కోడైన్ ఫాస్పేట్, నైట్రాజపమ్, పెంట జోషిన్, జోల్పిడేమ్, ట్రామాడాల్ మందులను ప్రిస్క్రిప్షన్ రిజిస్టర్లో నమోదు చేసి మాత్రమే అమ్మకాలు జరపాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఔషధ అధికారి సిహెచ్.సంపత్ కుమార్ పాల్గొన్నారు.