Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రామన్నపేట
హిజాబ్ పేరుతో ముస్లిం, మైనార్టీ విద్యార్థినులను చదువులకు దూరం చేసే కుట్రలను ప్రతి ఒక్క ప్రజాస్వామికవాది ఖండించాలని ఆవాజ్ జిల్లా కార్యదర్శి మీర్ ఖాజాఅలీ కోరారు.మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామంలో శుక్రవారం అవాజ్ కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నాటక రాష్ట్రంలోని ఉడిపి జిల్లా బండార్కర్ ఆర్ట్స్ కళాశాలలో హిజాబ్ ధరించారని ముస్లిం విద్యార్థినులను కాలేజీలోకి అనుమతించకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు. రెండు నెలల్లో పరీక్షలు ఉన్న నేపథ్యంలో వారి చదువులు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.రాజ్యాంగం కల్పించిన మతస్వేచ్ఛా హక్కుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగమౌలిక సూత్రాలకు విరుద్ధంగా ఉందని, ముస్లిం మహిళలను చదువుకు దూరం చేసే విధంగా ఉందని, విద్యాలయాలను మతం ఉద్రిక్తతలకు విద్వేషాలకు కేంద్రంగా మార్చడం సిగ్గుచేటని విమర్శించారు.మంగుళూరు చిక్‌మగుళూర్ ఉడిపి జిల్లాల్లో ఇలాంటి చౌకబారు ఎత్తుగడలతో రాజకీయ ప్రయోజనాలు పొందడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు.ఒకవైపు దేశప్రధాని బేటీ బచావో బేటీ పడావో అని హితోక్తులు చెపుతున్న, విద్యా రంగంలో ఎన్నో సమస్యలుంటే వాటిని పరిష్కరించే కషి చేయడంలో పాలకులు విఫలమయ్యారని విమర్శించారు.ఈ కార్యక్రమంలో ఆవాజ్ జిల్లా ఉపాధ్యక్షులు మీర్ యూసుఫ్ అలీ, ఎస్డి ఖాదర్, మీర్మాజిద్అలీ, ఎండి జాఫర్‌ఖాన్, ఎండీనయీమ్, మీర్ షాహెద్‌అలీ, ఎండి ముబీన్, ఎండి తాజొధిసద్దాం, హుసేన్, మీర్ అహ్మద్ అలీ, మీర్యాసిన్అలీ పాల్గొన్నారు.