Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఫిబ్రవరి21,22వ తేదీల్లో మహాసభలు
అ వాల్రైటింగ్లతో విస్తత ప్రచారం చేస్తున్న ఎస్ఎఫ్ఐ నాయకులు
అ ఆహ్వానసంఘం ఆధ్వర్యంలో మహాసభల ఏర్పాట్లు
చౌటుప్పల్రూరల్ :విద్యార్థి ఉద్యమ వేగు చుక్క భారత విద్యార్థి పెడరేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా 3 వ మహాసభలు విద్యార్థి ఉద్యమాల పురిటిగడ్డ చౌటుప్పల్లో ఫిబ్రవరి 21,22వ తేదీలలో జరగనున్నాయి.ఈ మహాసభల విజయవంతం కోసం ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షులుగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి,అధ్యక్షుడుగా విద్యావేత్త బత్తుల శంకర్లతో ఆహ్వాన సంఘం ఏర్పాటు చేసుకున్నారు.ఎస్ఎఫ్ఐ ఉద్యమంలో పనిచేసిన మాజీ నాయకులు, విద్యావేత్తలు,డాక్టర్లు, సామాజిక ఉద్యమ నాయకులు,ప్రజా సంఘాల నాయకులతో కలిసి మహాసభ విజయవంతం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.రెండు రోజులు జరిగే మహాసభలో మొదటి రోజు విద్యార్థులతో ప్రదర్శన నిర్వహిస్తారు.రెండోరోజు జిల్లావ్యాప్తంగా ఎంపికైన 200 మంది ప్రతినిధులతో మహాసభ జరగనుంది.చౌటుప్పల్లో మహాసభలు జరుగుతున్న నేపథ్యంలో మండలవ్యాప్తంగా వాల్ రైటింగ్ రాస్తూ, గోడ పత్రికలు, కరపత్రాలతో విస్తతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.ఈ మహాసభలో జిల్లా విద్యార్థి ఉద్యమ స్థితిగతులను సమీక్షించి,భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తారు.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు పల్లె శివ మాట్లాడుతూ చౌటుప్పల్ లో జరగనున్న మహాసభల జయప్రదం కోసం శ్రేయోభిలాషులు, విద్యావేత్తలు సహకరించాలని కోరారు.