Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ
నవతెలంగాణ-భువనగిరిటౌన్
పట్టణంలో అసంపూర్తిగా ఉన్న డబుల్బెడ్రూం ఇండ్లను పూర్తి చేసి అర్ములైన పేదలకు ఇవ్వాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీసభ్యులుబట్టుపల్లి అనురాధ డిమాండ్ చేశారు.ఈ విషయమై సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సింగన్నగూడెం డబుల్బెడ్రూం ఇండ్ల వద్ద ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీసభ్యులుబట్టుపల్లి అనురాధ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఆర్బాటంగా అనేక మోసపూరిత వాగ్దానాలు చేసి ఇండ్లు లేని నిరుపేదలందరికీ డబుల్బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తామని చెప్పి ప్రభుత్వం జిల్లాకేంద్రంలో డబుల్ బెడ్ రూమ్ఇండ్లు నిర్మాణం పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు.ఏండ్లు గడుస్తున్నా నేటికీ పూర్తి కాలేదని నల్లా, లిఫ్ట్ చేయలేదని, వాటర్ సౌకర్యం లేదని,విద్యుత్ సౌకర్యం లేదని విమర్శించారు.వెంటనే నిర్మించిన డబుల్బెడ్రూం ఇండ్లను పేదలకు కేటాయించాలని, లేనిపక్షంలో ఇండ్లను ఆక్రమించుకుంటామని హెచ్చరించారు.పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దాసరి పాండు మాట్లాడుతూ పార్టీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు తీసిన ఫలితంగానే ఇందిరమ్మకాలనీ డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టలేక తప్పలేదని ప్రభుత్వం చిత్తశుద్ధితో అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం పనులు పూర్తి చేయాలని కోరారు.పేదలకు వెంటనే నిర్మించిన ఇండ్లు కేటాయిొచాలని కోరారు.