Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అనంతగిరి
మండల పరిధిలో మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం ఎంపీపీ చుండూరు వెంకటేశ్వరరావు అధ్యక్షతన వాడివేడిగా సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధికారులు, నాయకులు సమయపాలన పాటించక పోవడంతో పాటు కొందరు ఆనారోగ్య కారణాలతో సమావేశానికి గైర్హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు గ్రామ సర్పంచులు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్చిం చారు. మిషన్ భగీరథ, ఆరోగ్య శాఖ, ఉపాధిహామీ, ఇరిగేషన్ మొదలగు శాఖలలో నెలకొన్న సమస్యలను గుర్తించి పరిష్కారం దిశగా చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎంపీడీఓ పంచాయతీ కార్యద ర్శులపై పని ఒత్తిడిలో సతమతమవుతున్న వారిపై ప్రభుత్వ అధికారిగా ఉంటూ దురుసుగా ప్రవర్తిం చడం తగదని గ్రామ సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం జెడ్పీటీసీ మిషన్ భగీరథ శాఖలో అలసత్వం తగదని, మండల వ్యాప్తంగా పూర్తిస్థాయిలో మిషన్ భగీరథ పనులు విని యోగాలు జరగడం లేదని ఆయా గ్రామాల్లో నెల కొన్న మిషన్ భగీరథ సమస్యలను వెంటనే పరి ష్కరించి నివేదికను అందించాలని ఆమె సంబంధిత అధికారిని ఆదేశించారు. సమావేశానికి గైర్హాజరైన అధికారులు, నాయకులు వివరణ ఇవ్వాలని, సమయపాలన పాటించని వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కొనతం ఉమా, ఎంపీడీవో శ్రీనివాస్, ఆయా శాఖల అధికారులు, ఎంపీటీసీిలు, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు.