Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
రాజ్యాంగాన్ని అవమాన పరిచేలా మాట్లాడిన సీఎం కేసీఆర్ వెంటనే దేశ ప్రజలకు, అంబేద్కర్‌కు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎమ్మార్పీఎస్, ఎం ఎస్పీ నల్గొండ జిల్లా కో ఆర్డినేటర్ బకరం శ్రీనివాస్ మాదిగ డిమాండ్ చేశారు. శుక్రవారం ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నల్గొండ మండలంలోని బుద్ధారం గ్రామంలో ఒక్కరోజు మహాదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ భారత రాజ్యాం గాన్ని మార్చాలని చేసిన వ్యాఖ్యలు దేశానికి ప్రమా దకరంగా ఉన్నాయని అన్నారు. భారత రాజ్యాం గాన్ని ఎందుకు మార్చాలో చెప్పాల్సిన బాధ్యత కేస ీఆర్కు ఉందన్నారు. అంబేద్కర్‌కు కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో మంద కృష్ణమాదిగ నాయకత్వంలో ఎమ్మార్పీఎస్ ఉద్యమ కార్యాచరణ ఇంకా ఉదృతం చేస్తామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు విద్యా ర్థి సంఘం జిల్లా అధ్యక్షులు కట్ట వినరు కుమార్, బుద్ధారం గ్రామ నాయకులు బకరం విజరు కుమార్, బకరం సైదులు, బకరం లింగస్వామి, దున్న లతీఫ్, దున్న లింగస్వామి, బకరం నరేందర్, దున్న అనిల్, బకరం కుమార్, బకరం జంగయ్య, బకరం ఎల్లయ్య, బకరం లింగయ్య, రాములు, పోలె రాజు, నారపాక రాజీవ్ తదితరులు పాల్గొన్నారు.
మాడ్గులపల్లి : తెలంగాణ ప్రజలకు మోడీ క్షమా పణ చెప్పాలని టీఆర్ఎస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు దర్శనం రాంబాబు అన్నారు. శుక్రవారం స్థానికంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ పోరాటాన్ని, ఆత్మగౌరవాన్ని అవమానపరిచిన ప్రధా ని మోడీ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం ఏర్పడటం బీజేపీకి ఇష్టంలేదని, తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేక పోతున్నారని అన్నారు. తెలంగాణ ప్రాజెక్టుల్లో దేనికీ జాతీయ హోదా కల్పించకుండా తెలంగాణ బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రి ఢిల్లీకి వెళ్లి అడ్డుపడుతున్నారని అన్నారు.