Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -మిర్యాలగూడ
ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటే అది భగవం తుడికి సేవ చేసినట్లే అని, సమాజంలోని విధి వంచితులను ప్రతి ఒక్కరూ ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, దానికోసం జనయేత్రి ఫౌండేషన్ ఎల్లప్పుడు ముందువరుసలో ఉంటుందని జనయేత్రి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మునిర్అహ్మద్ షరీఫ్ అన్నారు. శుక్రవారం మిర్యాలగూడ మండలం కాల్వపల్లికి చెందిన కిషన్ నాయక్ విద్యుత్ ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయి, కాళ్లు కదలక మంచానికే పరిమితమైన కిషన్‌నాయక్ కాంట్రాక్టు ఉద్యోగి కుటుంబాన్ని పరామర్శించి రూ.20 వేల నగదు, 60 కేజీల బియ్యం, నెలకు సరిపడా నిత్యావసర సరుకులు, దుప్పట్లు, కూరగాయలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కిషన్ నాయక్ కుటుంబాన్ని స్వచ్చంద సంస్థలు, మా నవతా వాదులు ఆదుకోవాలని కోరారు. గ్రూప్ మెసేజ్ ద్వారా స్పందించి కిషన్ నాయక్ కుటుంబాన్ని ఆదుకునేందుకు తమ వంతు సాయం చేసిన ప్రతి ఒక్క జన యేత్రీ ఫౌండేషన్ సభ్యులకి కృతజ్ఞతలు తెలిపారు .పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ కిషన్ నా యక్ కుటుంబాన్ని ప్రభుత్వం, విద్యుత్ శాఖా ఆదు కోవాలని కోరారు. జనయేత్రి నల్లగొండ జిల్లా ఇం ఛార్జి పోగుల సందీప్ మాట్లాడుతూ అనేక సేవా కార్యక్రమాలను చేపడుతున్న జనయేత్రి ఫౌండ ేషన్లో సభ్యులుగా చేరి తాము చేసే సేవా కార్యక్ర మాలలో భాగస్వామ్యులు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తాజ్ బాబా మాట్లాడుతూ కిషన్ నాయక్ భార్యకు ఉద్యోగం కల్పించాలని కోరారు. యాదగిరి, అమీర్ అలీ, సంజీవరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సిద్దు రెడ్డి, ఫాయాజ్, మాజీద్ కిరానం, ఫాహీం, పాపయ్య , ప్రవీణ్, రోహిత్, షాహిర్, రోహిత్, యూ సఫ్ పాల్గొన్నారు.