Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆలేరుటౌన్ :పట్టణంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ ప్రజాప్రతినిధులు, అధికారుల పర్యవేక్షణ లోపంతో ప్రమాదకరంగా తయారైన ఆలేరు నుండి రఘునాథపురం వెళ్లే రోడ్డు స్థానిక బీరప్ప దేవాలయం వద్ద ప్రమాద సూచికలు ఏర్పాటు చేయలేదు.ప్రమాదకరంగా తయారైన బ్రిడ్జి, రోడ్డు నిర్మాణపనులు నిత్యం రద్దీగా ఉండే రహదారిలో ఇక్కడ ఉన్న ప్రమాదకరమైన గోతులలో ద్విచక్ర వాహనదారులు అందులో పడి గాయాలపాల పాలవుతున్నారు.రోడ్డు బ్రిడ్జి నిర్మాణపనులకు కాల పరిమితి అంటూ లేకుండా కమీషన్లకు అలవాటు పడిన ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ లోపంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంతో పనులను చేపడుతున్నారని ప్రయాణికులు, నాయకులు బందెల సుభాష్ అధికారులను కోరుతున్నారు.