Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆలేరురూరల్
హైదరాబాద్ గాంధీ భవన్లో టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో డిజిటల్ మెంబర్ షిప్ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి మాణిక్యంఠాగూర్ హాజరై ఈ సందర్భంగా కోఆర్డి నేటర్లు, అధ్యక్షులను అభినందించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి బూతులో డిజిటల్ సభ్యత్వ నమోదు 100కు తగ్గవద్దని కోఆర్డినేటర్లకు సూచించారు. ఇప్పటికీ 30 లక్షల డిజిటల్ సభ్యత్వ నమోదు అయినందుకు అభినందించారు.త్వరలో 60లక్షల డిజిటల్ సభ్యత్వ నమోదు చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగామ ఉపేందర్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.