Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మిర్యాలగూడ :ఆవాజ్ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా మిర్యాలగూడ పట్టణానికి చెందిన ఎండీ. అంజాద్‌ను ఎన్నుకున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఆ సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాల్లో ఆయన్ని రాష్ట్ర కమిటీ సభ్యులు ఎన్నుకున్నట్లు ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి అబ్బాస్ తెలిపారు. అదేవిధంగా ఆ సంఘం సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ బాధ్యతలు కూడా అప్పగించారు. అంజాద్ గతంలో డీవైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, సోషల్ మీడియా కన్వీనర్‌గా పని చేశారు. ప్రస్తుతం సీపీఐ(ఎం) జిల్లా ఆహ్వానితుడిగా ఉన్నారు. ఈ సందర్భంగా అంజాద్ మాట్లా డుతూ ముస్లిం మైనార్టీలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని కోరారు. కర్ణాటక రాష్ట్రంలో హిజాబ్ పై ఆందోళన చేస్తున్న కషాయ మూకలను వెంటనే అరెస్టు చేయాలన్నారు. ఎన్నో ఏళ్లుగా ముస్లింలు సాంప్రదాయబద్దంగా హిజాబ్ అనుసరిస్తారని, దానిపై రాద్ధాంతం చేయడం సరైంది కాదన్నారు. ముస్లింలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర కమిటీకి ఎన్నుకున్నందుకు రాష్ట్రనాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.ఆయన నియా మకం పట్ల అవాజ్ జిల్లా నాయకులు ఆయూబ్, ఖాజా మొయినోద్దీన్, అంజాద్, అఫాన్‌అలీ, కరిమొద్దున్, అల్తాఫ్, వదూద్,సమద్ హర్షం వ్యక్తం చేశారు.