Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మునుగోడు
తరతరాలుగా వందల సంవత్సరాలుగా సకల వృత్తులతో ఉత్పత్తిని సష్టిస్తూ మానవ సమాజానికి సేవ చేస్తున్న సబ్బండ కులాల వాళ్ళు రక్షణ కోసం కేంద్ర, రాష్ర ్టప్రభుత్వాలు కులవృత్తుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోని కిష్టాపురం గ్రామానికి చెందిన గీత వృత్తిదారుడు మునుకుంట్ల లింగస్వామి ఇటీవల తాటిచెట్టు పైనుండి ప్రమాదవశాత్తు కింద పడి గాయపడిన సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి బూర వెంకటేశం మంజూరు చేసిన రూ.15వేలను, అదేవిధంగా జేఎస్ ఫౌండేషన్ నుండి రూ.5 వేలను ఆయనకు అందచేశారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల వారు తమ వృత్తులను నిర్వహించడంలో భాగంగా అనేకమంది ప్రమాదవశాత్తు మరణిస్తున్నారని, అదేవిధంగా తీవ్రంగా గాయపడి తదుపరి వృత్తిని చేపట్టలేని పరిస్థితులు ఉంటూ భార్యా బిడ్డలను తమ కుటుంబాలను పోషించుకోలేక పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో చండూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గౌడ్ జాజుల అంజయ్య గౌడ్, కోతులారం సర్పంచ్ జాజుల సత్యనారాయణ, పంతంగి నర్సింహ, కందుల లింగుస్వామి, జాజుల అరుణ్, మునుకుంట్ల రాములు, మునుకుంట్ల వెంకన్న, సురిగి స్వామి మహేశ్వరం వేణు, గౌడ సంఘం అధ్యక్షులు జాజుల నర్సింహ, బీసీ యువజన సంఘం మండల అధ్యక్షులు సురిగి నరసింహ, పంతంగి గోపాల్, సురిగి రాఘవులు పాల్గొన్నారు.