Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రామన్నపేట
గ్రామపంచాయతీ కార్మికులకు కేటగిరీ జీవో 60 ప్రకారం వారీగా వేతనాలు పెంచి ఇవ్వాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి మామిడి వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు.సంఘం మండల అధ్యక్షులు నకిరేకంటి రాము అధ్యక్షతన గ్రామపంచాయతీ కార్మికుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా పట్టణ నూతనకమిటీని ఎన్ను కున్నారు. గౌరవ అధ్య క్షురాలుగా కాడె యాదమ్మ, అధ్యక్షులుగా బొడ్డు సాలయ్య, కార్యదర్శిగా కందుల నర్సింహ, కోశాధికారిగా గాదె చంద్రయ్య, గాదె నర్సింహ, బొడ్డు రమేష్, నకిరేకంటి వసంత, మంగమ్మలను ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా మామిడి వెంకటరెడ్డి మాట్లాడుతూ మల్టీపర్పస్ విధానం రద్దు చేసి కేటగిరీ వారీగా రూ.19500, రూ.21500, రూ.22500, వేతనాలివ్వాలని డిమాండ్ చేశారు.మల్టీపర్పస్ పేరుతో కార్మికులతో వెట్టి చాకిరి చేయిస్తున్నారని, వేధింపులకు గురి చేస్తున్నారని విమర్శించారు. ప్రతినెలా ఒకటిన సబ్బులు, నూనెలు, జీతాలు, చెల్లించాలని కోరారు.ఈ కార్యక్రమంలో భవనకార్మిక సంఘం సీఐటీయూ జిల్లా అధ్యక్షులు గొరెగెసోములు, మండల అధ్యక్షులు నకిరేకంటి రాము, కార్యదర్శి బదెల భిక్షం, గాదె ఎల్లయ్య, నకిరేకంటి కష్ణయ్య, మేడి పథ్వీ, జయమ్మ, ప్రమీల, లక్ష్మీ, భారతమ్మ పాల్గొన్నారు.