Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
పార్లమెంట్ మాజీ సభ్యులు బొమ్మగాని ధర్మభిక్షం ప్రజాప్రతినిధిగా ప్రజలకు అందించిన సేవలు మరువలేనివని రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ జిల్లాఅధ్యక్షులు, జై గౌడ ఉద్యమ సంఘం రాష్ట్ర నాయకులు పంతంగి వీరస్వామిగౌడ్ అభిప్రాయపడ్డారు.ధర్మభిక్షం శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఆయన విగ్రహానికి జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్,జై గౌడ ఉద్యమ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో పూలమాలలేసి నివాళులర్పించి మాట్లాడారు. స్వాతంత్య్ర పోరాటంతో పాటు భూమి, భుక్తి, విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కూడా ముఖ్యభూమిక పోషించారని గుర్తుచేశారు.దొరల ,భూస్వాముల, పెత్తందార్ల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతూ ఆ ఉద్యమంలో ఎంతోమంది పేదలను భాగస్వామ్యం చేసిన ఘనత ధర్మభిక్షంకే దక్కిందన్నారు.తుదిశ్వాస విడిచే వరకు ప్రజలపక్షాన నిలిచి ప్రజా ఉద్యమాలను నిర్మించారని చెప్పుకొచ్చారు.ఈ తరం యువత ధర్మభిక్షంను స్ఫూర్తిగా తీసుకొని రాజకీయాల్లో రాణించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జై గౌడ ఉద్యమసంఘం రాష్ట్ర నాయకులు బూర మల్సూర్‌గౌడ్, రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ జిల్లా గౌరవ సలహాదారులు దేవత కిషన్ నాయక్,పట్టణ అధ్యక్షులు జలగంసత్యంగౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు పాలసైదులు, బొమ్మగానిశ్రీనివాస్గౌడ్, ఎల్గూరి రమాకిరణ్, బానోత్ జానీనాయక్, రాపర్తి సురేష్ గౌడ్, సారగండ్ల కోటేష్, అమరవాది శ్రావణ్‌కుమార్, గట్లశరణ్ పాల్గొన్నారు.