Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమలగిరి
తిరుమలగిరి మత్స్య పారిశ్రామిక సహకారసంఘంలో అర్హులైన వారందరికీ సభ్యత్వం ఇవ్వాలని తెలంగాణ ముదిరాజు హక్కులపోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బైరబోయిన వెంకటేశ్వర్లు కోరారు ఆదివారం ఆయన మండలకేంద్రంలో విలేకర్లతో మాట్లాడారు.ప్రభుత్వం జారీ చేసిన జీవో 6 ప్రకారం 18 ఏండ్లు నిండిన ముదిరాజ్ మత్స్యకార్మికులకు సొసైటీలో సభ్యత్వం ఇచ్చి ఉపాధి కల్పించాలని కోరారు.దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు ముదిరాజుల బతుకులు మార లేదన్నారు.గత ప్రభుత్వాల నిర్లక్ష్యం మూలంగా అన్ని రంగాలలో వెనుకబడి పోయా మన్నారు.జిల్లాలో నూతన సొసైటీలో ఏర్పాటుకు ప్రభుత్వంతో పాటు అధికారులు చొరవ తీసుకుని వివాదాలు రాకుండా ఏర్పాటు చేయాలన్నారు. నియోజకవర్గంలో చెరువులను దళారుల వశం కాకుండా సొసైటీలకు ఇవ్వాలని కోరారు.తిరుమలగిరి మున్సిపల్కేంద్రంలోని మత్స్యసహకారసంఘంలో రెండేండ్లుగా సభ్యత్వం ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న పాలకవర్గంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ నిబంధనల ప్రకారం సభ్యత్వం ఇవ్వకుండా రూ.20 వేలివ్వాలని డిమాండ్ చేస్తూ సభ్యత్వం ఇవ్వకుండా నిరాకరిస్తున్నారని విమర్శించారు.జిల్లా అధికారులకు తిరుమలగిరి విషయమై ఫిర్యాదు చేసిన పట్టించుకోకుండా వారికే సహకరిస్తున్నారని ఆరోపించారు.సభ్యత్వ విషయమై కొంతకాలంగా తిరుమలగిరిలో వివాదం జరుగుతున్నా అధికారులు తనకేమీ పట్టనట్టు వ్యవహరిస్తు పరోక్షంగా వారికే సహకరిస్తున్నారన్నారు.ఈ సమావేశంలో నాయకులు సోమేష్, నాగరాజు, యాకస్వామి,యాదగిరి పాల్గొన్నారు.