Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
జిల్లాలోని గుర్రంపోడు మండలం పాల్వాయి గ్రామానికి చెందిన పున్న అశోక్ ఫైటర్ పైలట్ కోర్సుకు ఎంపికయ్యారు. అయితే అతని తల్లిదండ్రుల శిక్షణకు అయ్యే ఖర్చు భరించడానికి స్తోమత లేకపోవడంతో అతని భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. న్యూస్ పేపర్లో రావడం ద్వారా చదివి విషయం తెలుసుకున్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదివారం అశోక్ సాయిని హైదరాబాద్‌లోని తన ఇంటికి పిలిపించుకుని సన్మానించారు. పైలట్ శిక్షణ పూర్తి అయ్యే వరకు ఎంత ఖర్చు అయినా భరిస్తానని హామీ ఇచ్చారు. ప్రతీ సంవత్సరానికి రూ.51వేల రూపాయలు ఖర్చు అవుతుంది. వాటితో పాటు అన్ని రకాలుగా అండగా ఉంటానని ఎంపీ కోమటిరెడ్డి హామీ ఇచ్చారు. దీంతో అశోక్ తీవ్ర భావోద్వేగం చెందారు. కష్టపడి చదివి ఫైటర్ పైలట్ శిక్షణకు ఎంపికైనా డబ్బులు లేకపోవడంతో ట్రైనింగ్‌కు వెళ్లలేనేమోనని భయం వేసిందని, ఎంపీ కోమటిరెడ్డి విషయం తెలుసుకుని ఇంటికి పిలిపించుకుని ఖర్చు భరిస్తానని హామీ ఇచ్చారని సంతోషం వ్యక్తం చేశారు. ఎంపీ కోమటిరెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటానని, ఆయన ఆశలు వమ్ము చేయకుండా కష్టపడి ట్రైనింగ్ పూర్తి చేస్తానని చెప్పారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఎయిర్‌ఫోర్స్ ఫైటర్ పైలట్ శిక్షణ పూర్తి చేసుకోవడానికి అండగా ఉంటానని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హామీ ఇచ్చారు.