Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ వ్యకాస రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండమడుగు నర్సింహ
నవతెలంగాణ-భువనగిరి
మార్చి 3,4 వతేదీల్లో యాదగిరిగుట్ట పట్టణంలో నిర్వహిస్తున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర విస్తతస్థాయి సమావేశాలను జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండమడుగు నర్సింహ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తర్వాత పోరాడి సాధించుకున్న ప్రజల హక్కులను కాలరాస్తూ, ప్రభుత్వ రంగస్థలం ప్రయివేట్పరం చేస్తూ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్న పరిస్థితి ఉన్నదన్నారు.మోడీ ప్రభుత్వం రూ.39 లక్షలకోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజాసంక్షేమాన్ని విస్మరించి కార్పొరేట్శక్తులకు వరాలను కురిపించిందని పేర్కొన్నారు.నిరుపేదల ఆహార సబ్సిడీలకోసం గత బడ్జెట్లో రూ.2.86 లక్షల కోట్లు కేటాయిస్తే ఈ బడ్జెట్లో రూ.2.06 లక్షల కోట్లకు తగ్గించారని పేర్కొన్నారు.ఉపాధిహామీ చట్టం పనులకు గతేడాది రూ.98 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తే, ఈసారి బడ్జెట్లో అధిక నిధులను పెంచకపోగా రూ.73 వేల కోట్లకు కుదించడం చాలా దారుణమని పేర్కొన్నారు.మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 35 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు కారుచౌకగా అమ్మారాని ఆవేదన వెలిబుచ్చారు.అనేక పోరాటాల ఫలితంగా వచ్చిన ఉపాధిహామీ చట్టాన్ని నిర్విర్యం చేయడానికి ప్రతి బడ్జెట్లో నిధులు తగ్గిస్తూ ఉపాధిహామీచట్టంలో పనిచేస్తున్న కార్మికులకు వారంవారం బిల్లులు చెల్లించాలక నానా ఇబ్బందులు పెడుతూ చట్టం మీద వ్యతిరేకత తేచ్చి కార్మికులు పనులకు రాకుండా, చట్టాన్ని ఎత్తి వేయాలనే కుట్రలు చేస్తున్నారని పేర్కొన్నారు. సమావేశాలకు ముఖ్య అతిథులుగా సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, జాతీయ కమిటీ సభ్యులు జి.నాగయ్య, రాష్ట్ర అధ్యక్షులు బుర్రి ప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రాములు హాజరవుతున్నట్టు పేర్కొన్నారు.ఈ సమావేశాల్లో వ్యవసాయ కార్మిక సంఘం నాయకత్వం అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.