Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ 10 గంటలకు కల్యాణముహూర్తుం ఖరారు
నవతెలంగాణ-యాదాద్రి
యాదాద్రి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న పాతగుట్ట వార్షికజాతరలో భాగంగా మూడో రోజు ఆదివారం రాత్రి అశ్వవాహనంపై శ్రీస్వామివారు, ముత్యాలపల్లకిపై శ్రీలక్ష్మీఅమ్మవారు ఎదుర్కొల్లోత్సవంలో పాల్గొనేందుకు రాత్రి 10 గంటలకు కల్యాణ మంటపానికి వేంచేశారు.శ్రీస్వామి అమ్మవారలకు నిశ్చితార్థం జరిపి పెండ్లి ఒప్పందం కుదుర్చేందుకు అర్చకులు, అధికారులు చేసు కున్న వాద సంవాదాలు భక్తులను ఎంతగానో అల రించాయి.ఈ ఉత్సవంలో స్వామి అమ్మవారలను అత్యంత శోభాయమానంగా అలంకరించి అశ్వవాహనారూడులను గావిం చారు.ఈ వాహన ఊరేగింపు కల్యాణవేదికపై అర్చక బృందం ఈ ఉత్సవ పూజలు నిర్వహించగా ఉత్సవ పెద్దలుగా ఆలయ ఇన్చార్జి ఈవో ఎన్.గీత, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి దంపతులు, ఏఈవోలు పాల్గొన్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఉదయం శ్రీ స్వామి అమ్మవారలు సింహ వాహన సేవలో తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు.ఈకార్యక్రమాల్లో ఆలయ ప్రధానార్చకులు, ఏఈవోలు దోర్భల భాస్కరశర్మ, గజివెల్లి రమేష్, వేముల రామ్మోహన్, సూపరింటెండెంట్లు గజివెల్లి రఘు, ఊడెపు వెంకటప్రసాద్, శంకర్‌నాయక్ దొమ్మాట సురేందర్‌రెడ్డి, ఉద్యోగులు, సిబ్బంది, ప్రముఖులు పాల్గొన్నారు.