Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ- ఆలేరుటౌన్
ఎన్సీసీ కెడెట్ 'ఎ' సర్టిఫికెట్ కోసం సోమవారం ఆలేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పరీక్షలు నిర్వహించారు. ఎసీసీ పదవ బెటాలియన్‌కు సంభందించి ఆలేరు, పోచన్నపేట ఉన్నత పాఠశాలల ఎన్సీసీ యూనిట్లకు సర్టిఫికెట్‌ను ఆర్మీ అధికారులు అందజేశారు. పోచన్న పేట, ఆలేరు ఎన్ సిసీ యూనిట్లకు సంబంధించి నిర్వహించిన పరీక్షకు 76 మంది విద్యార్థులు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎన్సీసీ అధికారి దూడల వెంకటేష్ మాట్లాడుతూ రాత, శారీరక పరీక్షలతోపాటు మాప్ రీడింగ్, వెపన్ ట్రైనింగ్, పర్సనాలిటీ డెవలపింగ్ తదితర అంశాలపై పరీక్షను నిర్వహించామని చెప్పారు. అనంతరం ఈ కార్యక్రమంలో జేసీఓ దత్త కదం, ప్రధానోపాధ్యాయులు ఎస్.నారాయణ , బాల్ రెడ్డి , ఆర్మీ అధికారులు భరత్ కదం, ఎన్సీసీ విద్యార్థులు పాల్గొన్నారు.