Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డీఆర్డీఏ పీడీ కాళిందిని
నవతెలంగాణ-నకిరేకల్
మహిళలు ఆర్థికంగా ఉన్నత స్థాయికి ఎదగాలంటే మంచి వ్యాపార రంగాన్ని ఎంచుకోవాలని డీఆర్డీఏ పీడీ కాళిందిని, నకిరేకల్ జెడ్పీటీసీ మద ధనలక్ష్మి నగేష్ గౌడ్ పేర్కొన్నారు. మండలంలోని వల్లభాపురం గ్రామంలో నాబార్డ్ ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో మహిళలకు నిర్వహిస్తున్న చేపల పెంపకంపై శిక్షణ కార్యక్రమం ముగింపు సమా వేశం జరిగింది. ఈ సంద ర్భంగా వారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లా డారు. మహిళల అభఙవృద్ధి కోసం ప్రభుత్వం అంద జేస్తున్న వివిధ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉపాధిహామీ పథకంలో చెరువుల నిర్మాణానికి ఆర్థిక సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాబార్డు డీడీ ఎం.వినరు కుమార్, ఐఆర్డీఎస్ అధ్యక్షులు వాడపల్లి రమేష్, మహిళలు పాల్గొన్నారు.