Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
నవతెలంగాణ-చిట్యాల
చిట్యాల మండలం ఎలికట్టె గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గుండే పద్మ -నర్సింహా కుమారుడు గుండే యుగేందర్ ఎంబీబీఎస్కు ఎంపిక కావడంతో అతని తల్లిదండ్రులకు చదువుకు అయ్యే ఖర్చు భరించడానికి స్తోమత లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గుడిపాటి లక్ష్మీ నరసింహ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని హైదరాబాద్లో ఆయన నివాసంలో సోమవారం కలిశారు. అందుకు స్పందించిన ఎంపీ విద్యార్థి చదువు పూర్తయ్యే వరకు అయ్యే ఖర్చును భరిస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థి కుటుంబ సభ్యులు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వనిపాకల మాజీ సర్పంచ్ కట్టంగూర్ మల్లేష్, ఓబీసీ డిపార్ట్మెంట్ అధ్యక్షుడు జంపాల వెంకన్న, ఆరెగూడెం గ్రామ శాఖ అధ్యక్షుడు కిషోర్, కంప మల్లయ్య, వెంకన్న, సత్తయ్య పాల్గొన్నారు.