Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నవతెలంగాణ-నార్కట్‌పల్లి
రెండు నెలల్లో ఉదయ సముద్రం ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం నార్కట్‌పల్లి మండలంలో రూ.50 లక్షల వ్యయంతో, బ్రాహ్మణవెళ్ళెంలలో రూ.30 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు నల్గొండ జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలోని వార్డుల్లో పర్యటించి గ్రామస్థులతో మాట్లాడారు. అందరికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ గ్రామాన్ని అభివద్ధిలో అగ్రగామిగా ఉంచుతామని తెలిపారు. అనంతరం కొండపాకొనిగూడెం గ్రామంలో రూ.10 లక్షలతో, శేరుబావిగూడెంలో రూ.10 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు వారు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు సూదిరెడ్డి నరేందర్ రెడ్డి, మండల పరిషత్ అధ్యక్షుడు కల్లూరి యాదగిరి గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు యానాల మాధవి అశోక్ రెడ్డి, కొమ్మనబోయిన మల్లేష్, యానాల ఇందిరా సత్తిరెడ్డి, ఎంపీటీసీలు చిరుమర్తి యా దయ్య, మేకల రాజిరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బైరెడ్డి కరుణాకర్ రెడ్డి, టీిఆర్‌ఎస్ మండల ఉపాధ్యక్షులు తిరుగుడు మహాలింగం, పీఏసీఎస్ మాజీ చైర్మన్ బత్తుల అనంతరెడ్డి, తిరుగుడు రవి, డైరెక్టర్ పులిపల్లి శంకర్ రెడ్డి, సైదాచారి, శివ, మేక వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.
సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
కొండపాకగూడెం గ్రామానికి చెందిన జీడిమడ్ల వినోదమ్మ, శేరుబావిగూడెం గ్రామానికి చెందిన జోగు నర్సింహ వివిధ అనారోగ్య కారణాలతో ప్రయివేటు హాస్పిటల్లో చికిత్సపొంది సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రత్యేక చొరవతో రూ.60 వేలు, రూ.40 వేల చెక్కులను మంజూరు చేయించి వారి గ్రామాలలో బాధితులకు అందజేశారు.