Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
పెండింగులో ఉన్న స్కాలర్ షిప్స్, ఫీజు రీయింబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయాలని నిరసన వ్యక్తం చేస్తూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిభా ఫూలే విగ్రహానికి సోమవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న రెసిడెన్సియల్ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను తక్షణమే కల్పించాలి బీసీ గురుకులాలకు పక్కా భవనాలు నిర్మించాలని కోరారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరారు. రీయింబర్స్ మెంటు సకాలంలో చెల్లించనందున కొర్పొరేట్ కాలేజీలు విద్యార్థులకు సర్టిఫికెట్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మహిళా సంఘాల అధ్యక్షురాలు సందేనబోయీన జయమ్మ, పట్టణ కాంగ్రెస్ నాయకులు ఏం.ఏ అలీమ్, బెజ్జం జానయ్య, జంగిలి వెంకన్న యాదవ్, మండల సావిత్రి, సతీష్, నాగేశ్వరరావు, చిన్న, శ్రీను, వంశీ పాల్గొన్నారు.