Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి
నవతెలంగాణ-గుర్రంపోడు
యువత స్వయం ఉపాధిని ఎంచుకోవాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు. సోమవారం ఆయన గుర్రంపోడు మండల కేంద్రంలోని దేవరకొండ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ రేణుక ఎల్లమ్మ హైడ్రాలిక్ వాటర్ సర్వీసింగ్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత స్వయం ఉపాధిని ఎంచుకొని వ్యాపార రంగంలో రాణించి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీి గాలి సరిత రవికుమార్ గౌడ్, స్థానిక సర్పంచ్ మస్రత్ జసయ్యద్ మియా, ఉప సర్పంచ్ పగిళ్ల లాలయ్య, మండల రైతుబంధు అధ్యక్షులు బల్గూరి నగేష్‌గౌడ్, మండల టీఆర్ఎస్ నాయకులు మోపూరి యాదగిరి రెడ్డి, వద్దిరెడ్డి యాదగిరి రెడ్డి, మునగాల యాదగిరి, రావుల సైదులు గౌడ ్(ఆర్.ఎస్) రావుల శ్రీనివాస్‌గౌడ్, షేక్ సయ్యద్ మియా, మోపూరి వెంకన్న, నిర్వాహకులు సంతోష్ కుమార్ చారి పాల్గొన్నారు.