Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-డిండి
వ్యక్తిని గొడ్డలితో నరికి హత్యచేసిన సంఘటన సోమవారం డిండి మండలం పడమటితండాలో చోటుచేసుకొంది. డిండి ఎస్ఐ ఎస్.సురేష్ తెలిపిన వివరాల ప్రకారం డిండి మండలం పడమటి తండాకు చెందిన జర్పుల చీన్య తండ్రి బిచ్య (45) అను వ్యక్తి అదే గ్రామానికి చెందిన రాత్లావత్ పండు భర్త శంకర్, ఆమె కుమారుడు రాత్లావత్ సురేష్ సోమవారం రాత్రి గొడ్డలితో నరికి చంపినట్లు ఆయన తెలిపారు. చీన్యకు గత 25 సంవత్సరాల క్రింత కరంటుషాక్తో రెండుచేతులు సగము వరకు తెగిపోయాయి. దాంతో చీన్య భార్య వదిలి పోవటంతో అదే గ్రామానికి చెందిన రాత్లావత్ పండుతో సన్నిహితం ఏర్పరుచుకున్నాడు. అది కాస్త వివేహేతర సంబంధంగా మారింది. పండు పిల్లలు పెద్ద కావటంతో ఈ విషయంపై పలుమార్లు గొడవలు జరగగా గ్రామపెద్దలు వారిని వేరువేరుగా ఉండమని నిర్ణయించారు. అయినా చీన్య పెద్దమనుషుల మాటలు వినకుండా పండు ఇంటికి అప్పుడప్పుడు వెళ్ళున్నాడు. దాంతో పండు భర్త, ఆమె కుమారు పథకం ప్రకారం ఆదివారం రాత్రి తమ ఇంటికి పిలిపించి సుమారు రెండు గంటల ప్రాంతంలో గొడ్డలితో తలపై బలంగా నరికారు. దాంతో అతను మరణించినట్లు ఎస్సై తెలిపారు. చీన్య కుమారుడు జర్పుల శివ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని డిండి సీఐ కె.భీసన్న కేసును దర్య్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్డం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పచెప్పినట్లు ఆయన తెలిపారు.