Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గరిడేపల్లి
గడ్డిపల్లి శ్రీ అరబిందో కేవీకే వ్యవస్థాపకులు, కర్మయోగిగా పేరు తెచ్చుకున్న డాక్టర్ ఘంటా గోపాల్‌రెడ్డి ఆశయాలను సాధించాలని ఎస్ఏఐఆర్డీ బోర్డు డైరెక్టర్ డాక్టర్ కె.ప్రతాపరెడ్డి అన్నారు.సోమవారం గోపాల్‌రెడ్డి 91వ జయంతి సందర్భంగా గడ్డిపల్లి కేవీకేలో ఏర్పాటు చేసిన జయంతి సంబురాల్లో ఆయన మాట్లాడారు.మహాత్మాగాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా 3 మండ లాల పరిధిలోని 7 గ్రామాలకు సాగునీరు, 14 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు చేపట్టి 40 వేల ఎకరాలకు సాగునీరందేలా కష ిచేసిన ఘనత ఆయనదేనన్నారు .గోపాల్‌రెడ్డి హయాంలోనే 1996 లో గడ్డిపల్లి కేవీకే దేశంలోనే ఉత్తమ కేవీకేగా అవార్డు పొందిందని గుర్తు చేశారు.గోపాల్‌రెడ్డి జీవిత విశేషాలు, కేవీకే స్థాపన, చేపట్టిన వివిధ ప్రాజెక్టులు, రైతుల అభివద్ధికి చేసిన కషి, ఇప్పటివరకు సాధించిన ప్రగతి మొదలగు విషయాల గురించి వివరించారు.ఆయన ఆశయసాధనకు సంస్థ సిబ్బంది పని చేయాలని, వారు స్థాపించిన సంస్థ అభివద్ధికి తోడ్పడాలని కోరారు.అనంతరం సిబ్బందికి గోపాల్‌రెడ్డి జయంతి సందర్భంగా టీ షర్ట్స్్ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కెేవీకే కార్యదర్శి డా.ఘంటాసత్యనారాయణరెడ్డి, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ లవకుమార్, శాస్త్రవేత్తలు సీహెచ్.నరేష్, కిరణ్, డి.నరేష్, టి.మాధురి, సుగంధి, ఆదర్శ్, ఆఫీసు సిబ్బంది సత్యనారాయణరెడ్డి, సైదులు, ఉపేందర్, కష్ణ, ప్రభాకర్ పాల్గొన్నారు.