Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
పట్టణపరిధిలోని కొమరబండ 11వ వార్డులో డీఎస్పీ ఆధ్వర్యంలో సోమవారం కార్డన్‌సెర్చ్ నిర్వహించారు.ఈ సందర్భంగా డీఎస్పీ రఘు మాట్లాడుతూ సైబర్ క్రైమ్ మోసాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. పొరపాటున ఓటీపీ చెప్పి నగదు మోసపోతే 155260 చరవాణికి సమాచారం ఇవ్వాలన్నారు. కొత్త వ్యక్తులకు ఇండ్లు కిరాయి ఇవ్వకూడదని సూచించారు.యువత గంజాయికి అలవాటు పడకుండా తగిన జాగ్రత్తలు తల్లిదండ్రులు తీసుకోవాల్సిందిగా కోరారు.నాలుగు ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో సరైనపత్రాలు లేకపోవడంతో వాటిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.ఈ కార్యక్రమంలో ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలు, 70 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.