Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెన్పహాడ్
అనాది కాలంగా వస్తున్న భూ సర్వే రికార్డులను మార్చి భూస్వాములకు తొత్తులుగా వ్యవహరిస్తున్న రెవెన్యూ అధికారులపై ఉన్నతాధికారులు, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారిని సస్పెండ్ చేయాలని మండల పరిధిలోని భక్తాళ్లపురం గ్రామానికి చెందిన దళితులు సోమవారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట నల్లబ్యాడ్జీలను ధరించి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా పలువురు దళితులు మాట్లాడుతూ గ్రామానికి చెందిన సర్వే నెంబర్ 60లో ఎకరాల 3.20 గుంటల భూమిని కొన్నేండ్లుగా ప్రభుత్వం ఇనామ్ భూములుగా దళితులకు అందిస్తే తాతల తండ్రుల నాటినుండి తాము అనుభవిస్తుంటే 2020 జూన్లో రెవెన్యూ అధికారులు పహనిలను టాపింగ్ చేసి గ్రామానికి చెందిన భూస్వామి నల్లపు రామూర్తి తండ్రి నల్లపు రామయ్యల పేరున మార్చారని ఆరోపించారు. దీనిపై రెండేండ్ల కింద కలెక్టర్కు, ఆర్డీఓకు పిర్యాదు చేయగా తహసీల్దార్ విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోవాలని సూచించారని తెలిపారు. కానీ స్థానిక రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యహరిస్తున్నారని, క్షేత్ర స్థాయి పరిశీలనచేయకుండా ఆఫీస్లో కూర్చుని ఆర్ఐ పంచనామా నిర్వహించారని, దీనికి డిప్యూటీ తహసీల్దార్ వత్తాసు పలుకుతూన్నారని ఒకరిపై ఒకరు చెపుతూ భూకబ్జాలో ఉన్న తమకు మోసం చేస్తున్నారన్నారు.1994-95 పహాణీలో ఉన్న తమ పేర్లను కొట్టివేసి నల్లపు రామయ్య పేరును నమోదు చేశారన్నారు.ఇలాంటి అక్రమాలకు పాల్పడిన అధికారులపై, ,భూఆక్రమణదారులపై చట్టరిత్యా చర్యలుతీసుకోవాలని కోరారు.అనంతరం తహ సీల్దార్ శేషగిరిరావుకు వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో దళితులు నెమ్మాది కనకయ్య,నెమ్మాది క్రిష్ణ, నెమ్మాది వెంకటరమణ, నెమ్మాది నాగయ్య, సైదులు, జనార్దన్, అంజయ్య పాల్గొన్నారు.