Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చండూర్
మున్సిపాలిటీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మున్సిపల్ ప్రత్యేక సమావేశంలో రసాభాసగా మారింది. మున్సిపల్లో 10 వార్డులు ఉండగా ఎక్కువగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు, చైర్ పర్సన్ సొంత నిర్ణయాలు తీసుకుని సమాచారం ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరి స్తున్నారని, మడిగెల బహిరంగ వేలం విషయంలోనూ సొంతంగా వ్యవహరిస్తున్నారని కౌన్సిలర్లు చిలుకూరి రాధిక శ్రీనివాస్, కోడి వెంకన్న మండిపడ్డారు. కమిషనర్, కౌన్సిలర్ లకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తాను ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారంటూ వాదోప వాదనలు జరిగాయి. మున్సిపల్ పాలకవర్గం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు కూడా అభివృద్ధి పనులు చేయక పోవడం, తమకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని, చైర్పర్సన్, కమిషనర్‌కు అనుకూలంగా ఉన్న కౌన్సిలర్లకు మాత్రమే వివక్షత చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై కమిషనర్ వెంకట్రావు వివరణ కోరగా కౌన్సిలర్లపై వివక్షత చూపడం అనడం వాస్తవం లేదపి, ప్రభుత్వం ఇచ్చిన గైడెన్స్ ప్రకారమే నడుచుకుంటూ ఉన్నామన్నారు. కౌన్సిలర్లు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నామని, తనపై కావాలనే కొందరు ఆరోపవాదనలు చేస్తున్నారని చెప్పారు. భవిష్యత్తులో సమాచార లోపం పునరావతం కాకుండా చూస్తామని మున్సిపల్ చైర్ పర్సన్ తోకల చంద్రకళ వెంకన్న చెప్పారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.