Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అదనపుకలెక్టర్ పాటిల్హేమంత్ కేశవ్
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
జిల్లాలోని పురపాలికలలో పనులను ఎప్పటికప్పుడు చేపట్టి అభివద్ధిలో ముందుంచాలని అదనపుకలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ నందు పురపాలిక కమిషనర్లతో ఏర్పాటు చేసిన 2022-23 బడ్జెట్ డ్రాఫ్ట్ సమావేశంలో ఆయన మాట్లాడారు.అన్ని పురపాలికలలో రోజువారీ పనులు ఎప్పటికప్పుడు చేపట్టి పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.ప్రభుత్వం పుర పాలికలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు.ఆ దిశగా సంబం ధిత అధికారులు నిబద్ధతతో పనిచేయాలని సూచించారు.జిల్లాలోని అన్ని పురపాలికలలో చేపడుతున్న పనులను నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు.బడ్జెట్లో 10 శాతం గ్రీన్బడ్జెట్కు కేటాయించాలని అలాగే 1/3 నిధులు బీపీఎల్ పరిధిలోకి తీసుకొని అత్యవసర సమయాలలో ఖర్చు చేయాలని తెలిపారు.17న ఫైనల్ బడ్జెట్ ఆమోదంకు పూర్తిస్థాయిలో ప్రతిపాదనలు అందించాలని సూచించారు.అనంతరం నిధులు కేటాయింపు, ఖర్చులపై పలు సూచనలు, సలహాలు చేశారు.ఈ కార్యక్రమంలో పురపాలిక కమిషనర్లు నేరేడుచర్ల ఎన్.వెంకటేశ్వర్లు, హుజూర్నగర్ శ్రీనివాసరెడ్డి, మేనేజర్లు కె.శ్రీనివాసరెడ్డి, మేనేజర్లు పి.శ్రీనివాసస్వామి,ఎం.బుల్లిబాబు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.