Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ డాక్టర్ అక్కెనపల్లీ మీనయ్య
నవతెలంగాణ-నల్లగొండ
సమాజాన్ని పట్టి పీడిస్తున్న కులమత హింస నుంచి ప్రజలను కాపాడుకొని కులనిర్మూలన జరుగాలంటే కులమతాంతర వివహాలను ప్రొత్సహిద్దామని డాక్టర్ అక్కెనపల్లీ మీనయ్య పిలుపునిచ్చారు. ప్రేమికుల రోజు సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలోని కులవివక్ష వ్యతిరేకపోరాట సంఘం ఆధ్వర్యంలో యూటీఎఫ్ భవనంలో బొల్లేపల్లి మంజుల అధ్యక్షతన ఆదర్శవివాహితుల అభినందన సభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు మనువాద బ్రహ్మనిజ ఆదిపత్య వర్గాల ఆగాడాల వలనే ధళిత, గిరిజన, పేదలు అణగదొక్క బడుతున్నారని, కులాంతర వివాహితులకు రక్షణ లేదని, కులదురంహాంకార హత్యలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 14 ప్రేమికులరోజు సందర్భంగా మనువాదులు వెకిలి చేష్టలు చేస్తున్నారని, అసాంఘిక పద్ధతులలో భయబ్రాంతులకు గురిచేస్తున్నారని, దీని వలన ఆత్మహత్యలు జరుగుతున్నాయని అన్నారు. అదర్శవివాహాలు జరుగాలి కానీ అశాస్త్రీయ బ్రహ్మణ వేదమంత్రాలెందుకనీ ప్రశ్నించారు. కులం నిర్మ్షులించుటకు కులాంతర వివాహలు అవసరమనీ అన్నారు. నేడు పాలక పార్టీల అనాలోచిత నిర్ణయాల వలన అభివృద్ధి పత్రికలకే పరిమితమైందని అన్నారు. ప్రముఖ న్యాయవాది దర్శనం నర్సింహ మాట్లాడుతూ రాష్ట్రంలో కుల దురహంకార హత్యలు పెరిగిపోయాయని, చట్టాన్ని పరిరక్షించాల్సిన యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటుందని దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రణరు హత్య కుల దురహంకార హత్యేనని అన్నారు. కులాంతర వివాహితులకు రక్షణ చట్టం చేయాలని డిమాండ్ చేశారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ చెప్పిన విధంగా ప్రతి దళిత గిరిజనుడు చైతన్యవంతమై చదువు అనే విజ్ఞానం ద్వారా సమాజంలో జరుగుతున్న అఘాయిత్యాలకు అనాలోచిత నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి నన్నూరి వెంకట రమణారెడ్డి, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీను, రాష్ట్ర కమిటీ సభ్యులు రెమడాల పర్శరాములు, జిట్టా నగేష్, దేవతల సైదులు, జిల్లా ఉపాధ్యక్షులు పెరికే విజరు కుమార్, జిల్లా కమిటీ సభ్యులు బొల్లు రవీందర్ కుమార్, బొంగరాల వెంకటయ్య , దోరెపల్లి మల్లయ్య, చిలుముల రామస్వామి, గంటెకంపు రమణయ్య, బొంగరాల ఎల్లయ్య, దైదా జనార్ధన్ పాల్గొన్నారు. అనంతరం ఆదర్శ దంపతులు మానుపాటి భిక్షమయ్య సుజాత, మణమద్దె జానయ్యస్వాతీ, బొల్లేపల్లి వెంకటేష్ మంజుల దంపతులకు సన్మానం చేశారు.