Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చివ్వెంల
తెలంగాణ రాష్ట్ర సాధకులు, ఉద్యమ సారధి, సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను మండలవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు,వైస్‌ఎంపీపీ జూలకంటి జీవన్‌రెడ్డి కోరారు.మండల కేంద్రంలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు ఈ నెల 15,16,17వ తేదీల్లో కేసీఆర్ జన్మదిన వేడు కలను మండల వ్యాప్తంగా పెద్దఎత్తున నిర్వహి ంచాలని పిలుపు నిచ్చారు.15వ తేదీన ప్రతి గ్రామంలో అన్నదాన కార్యక్రమం, 16వ తేదిన నియోజకవర్గ కేంద్రాలలో రక్తదాన శిబిరాలు, 17వ తేదిన సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో సర్వమత ప్రార్థనలు, మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించాలని కోరారు.ఈ సమావేశంలో పీఏసీఎస్ చైర్మెన్ మారినేని సుధీర్ రావు, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు జూలకంటి సుధాకర్‌రెడ్డి,రౌతు నర్సింహారావు, ధరావత్ బాబు, పుట్ట గురువేందర్,హనుమంతరావు, గోవిందరెడ్డి, నాగరాజు, సాగర్, అనిల్, రమేష్‌రెడ్డి, నాగునాయక్, చంప్లా,నగేష్, కోటి పాల్గొన్నారు.