Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్
నవతెలంగాణ-చౌటుప్పల్
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ అనేక దఫాలుగా ప్రకటనలు చేసిన సందర్భాలు ఉన్నాయని, బీజేపీ రాజ్యాంగేతర చర్యలను వ్యతిరేకించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ అన్నారు. సోమవారం మున్సిపల్ కేంద్రంలోని కందాల రంగారెడ్డి స్మారక భవనంలో హిజాబ్ వివాదంపై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ మత అల్లర్లు సష్టించడంతో మతోన్మాదం మరింత పెరిగిందన్నారు. భారత రాజ్యాంగం బీజేపీ పరిపాలనకు అడ్డుగా ఉందని, దానిని మార్చాలనే ప్రయత్నం చేస్తుందన్నారు. ప్రధానంగా బీజేపీ మతోన్మాద రాజకీయాలకు కర్ణాటకలో జరిగిన హిజాబ్ నిదర్శనమన్నారు. హిజాబ్‌ను బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తులు మరింత విష ప్రచారంలోకి తీసుకువెళ్లి దానిని ఇతర ప్రాంతాలకు వ్యాపించేలా చేస్తున్నాయన్నారు. బీఎస్పీ రాష్ట్ర నాయకులు మస్కు నర్సింహా మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘించి పరిపాలన చేస్తుందని, హిజాబ్‌పై కర్ణాటకలోని వివాదంపై సుప్రీంకోర్టు తీర్పును వెంటనే ఇవ్వాలని కోరారు. సీపీఐ మున్సిపల్ కార్యదర్శి పగిళ్ల మోహన్‌రెడ్డి మాట్లాడుతూ మోడి పాలనలో మతతత్వ రాజకీయాలు పెరిగాయని విమర్శించారు. ఐద్వా జిల్లా అధ్యక్షురాలు అవ్వారు రామేశ్వరి మాట్లాడుతూ బీజేపీ పాలనలో మహిళలపై దాడులు మరింత పెరిగాయని, మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఈ సమావేశంలో నాయకులు ఎమ్‌డి.పాషా, ఎమ్‌డి.జావిద్, గడ్డం వెంకటేశం, ఎమ్‌డి.ఖయ్యుమ్, పల్లె మధుకష్ణ, శివకుమార్, దేప రాజు, సామిడి నాగరాజురెడ్డి, ఎమ్‌డి.అర్షియాబేగం, గంగదేవి సైదులు, బండారు నర్సింహా పాల్గొన్నారు.