Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ డాక్టర్ ఏ.శరత్ ,రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్
అ ఎస్.లింగోటం గ్రామ సందర్శన
అ సర్పంచ్, కార్యదర్శి, సిబ్బందికి అభినందనలు
నవతెలంగాణ-చౌటుప్పల్రూరల్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పల్లె ప్రగతి వల్ల గ్రామాల స్వరూపాలు మారాయని రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ ఏ.శరత్ అన్నారు. చౌటుప్పల్ మండలం స్వాముల వారి లింగోటం గ్రామాన్ని సోమవారం సందర్శించారు.పల్లె ప్రగతిలో భాగంగా నిర్మించిన డంపింగ్ యార్డు, శ్మశాన వాటిక, నర్సరీ, రోడ్ల వెంట హరితహారంలో నాటిన మొక్కలను పరిశీలించారు. గ్రామంలో జరుగుతున్న అభివద్ధి కార్యక్రమాలనుసర్పంచ్ ఆకుల సునీత శ్రీకాంత్,పంచాయతీ కార్యదర్శి జ్యోతిలను అడిగి తెలుసుకున్నారు. పారిశుధ్యంపై సంతప్తి వ్యక్తం చేశారు. పంచాయతీ సిబ్బందిని అభినందించారు. సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాలకు ప్రతి నెల నిధులు ఇస్తున్నామని తెలిపారు. గతంలో పల్లె ప్రగతి కార్యక్రమం లేనప్పుడు గ్రామాల్లో ఎక్కడి చెత్త అక్కడే ఉండేదన్నారు.ప్రతి గ్రామానికి చెత్త సేకరణకు ట్రాక్టర్ ను ఇవ్వడంతో చెత్త సేకరణ సులువైందని పేర్కొన్నారు.దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలోని పల్లెలు ఆదర్శ గ్రామాలుగా వెలుగొందుతున్నాయని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో కష్ణారెడ్డి, డీఆర్డీఓ మందడి ఉపేందర్ రెడ్డి, అడిషనల్ డీఆర్డీడీఓ నాగిరెడ్డి, డీపీఓ సునంద, డీఈలు దిన్ దయల్, లింగయ్య, డీఎల్పీఓ సాధన, ఎండీఓ రాకేష్ రావు, ఎంపీఓ అంజిరెడ్డి, గ్రామ సర్పంచ్ ఆకుల సునీత శ్రీకాంత్, వైస్ ఎంపీపీ ఉప్పు భద్రయ్య, ఉపసర్పంచ్ గంగాపురం గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.