Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేవరకొండ :స్వచ్ఛ మున్సిపాలిటీయే ప్రభుత్వం లక్ష్యమని టీఆర్ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. మంగళవారం దేవరకొండ పట్టణంలో రూ.42 లక్షలతో కొనుగోలు చేసిన స్వీపింగ్ మిషిన్‌ను ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఆయన అన్నారు. పట్టణంలో పారిశుద్ధ్య నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానన్నారు. దేవర కొండ మున్సి పాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నర్సింహా, ఎంపీపీ నల్లగాసు జాన్ యాదవ్, జెడ్పీటీసీ మారుపాకుల అరుణసురేష్ గౌడ్, రైతుబంధు అధ్యక్షుడు శిరందాసు కృష్ణయ్య, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్, టీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు టీవీఎన్. రెడ్డి, పున్న వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు హన్మంత్ వెంకటేష్ గౌడ్, వైస్ చైర్మన్ రహత్ అలీ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పేర్వాల జంగారెడ్డి, టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేముల రాజు, టీఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు బొడ్డుపల్లి కృష్ణ, పొన్నబోయిన సైదులు, మూడావత్ జయప్రకాష్‌నారాయణ,మహమ్మద్ రైస్, తౌఫిక్ఖాద్రి, ఇలియాస్, బాబా పాల్గొన్నారు.