Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నకిరేకల్
ఆరు దశాబ్దాల తెలంగాణ రాష్ట్ర ప్రజల కలలను సాకారం చేసింది ముఖ్యమంత్రి కేసీఆర్ అని, ఆయన నాయకత్వం దేశానికి శ్రీరామరక్ష అని స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. మంగళవారం నకిరేకల్ పట్టణంలో కేసీఆర్ జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మాగాంధీ, అంబేద్కర్ వంటి మహనీయుల బాటలో రాష్ట్రాన్ని అభివద్ధిలో అగ్రగామిగా నిలిపారన్నారు. కేసీఆర్ అంటే వ్యక్తి కాదని నాలుగు కోట్ల ప్రజల గుండెచప్పుడు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మాద ధనలక్ష్మి నగేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ నడికుడి ఉమారాణి వెంకటేశ్వర్లు, పీఏసీఎస్ చైర్మన్ పల్ రెడ్డి మహేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ మురారి శెట్టి ఉమారాణి కృష్ణమూర్తి, టీిఆర్ఎస్ మండల అధ్యక్ష కార్యదర్శులు పగడపు నవీన్ రావు, నోముల కేశవరాజు, పట్టణ అధ్యక్షుడు సైదిరెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.