Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిప్పర్తి : కేంద్ర బడ్జెట్ 2022లో జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించలేదని ప్రజా పర్యవేక్షణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ సురుపంగ శివలింగం అన్నారు. మంగళవారం తిప్పర్తి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ సంఘం జాతీయ, రాష్ట్ర నాయకులు కంచు కట్ల సుభాష్, వి. రమేష్‌లతో కలిసి ఆయన మాట్లాడారు. జనాభా నిష్పత్తి ప్రకారం ఎస్సీలకు లక్షా 82 వేల 976 కోట్లు కేటాయించాల్సి ఉండగా కేవలం రూ.లక్షా 42 వేలు కోట్లు, ఎస్టీలకు 98 వేల 664 కోట్లు కేటాయించాల్సి ఉండగా కేవలం రూ.89 వేల కోట్లు మాత్రమే కేటాయించడం దారుణమన్నారు. బీజేపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు కేటాయించక పోవడంతో రూ.9 లక్షల 89 వేెల 315 కోట్లు దళిత, ఆదివాసీలు నష్టపో యారన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిధులు రూ.6 వేల కోట్లు మాత్రమే కేటాయించడం అమానుషం అన్నారు. విద్యకు సంబంధించి పోస్టుమెట్రిక్ స్కాలర్షిప్స్ రూ.5 వేల 600 కోట్లు కేటాయించడం కంటి తుడుపు చర్యమాత్రమే అన్నారు. ఉపాధి హామీ పథకానికి కేవలం రూ.73వేల కోట్లు కేటాయించడం దారుణమని అన్నారు. కావున ప్రభుత్వం పునరాలోచన చేయాలని సూచించారు. అదేవిధంగా ఈనెల 1వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రెస్మీట్లో మాట్లాడుతూ రాజ్యాంగాన్ని మార్చాలని అనడాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పీఎంసీ కేంద్ర కమిటీ సభ్యులు కంచుకట్ల సుభాష్, జిల్లా కో ఆర్డినేటర్ వి.రమేష్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.