Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెన్‌పహాడ్
మండలంలోని భక్తాలపురం గ్రామానికి చెందిన కొందరు దళితులు వారి భూఅక్రమణ చేసుకున్నామని తమపై చేసే ఆరోపణలు అసత్యమని ఆరోపిస్తూ అదే గ్రామానికి చెందిన నల్లపు రామయ్య కుమారులు, కోడండ్లు మంగళవారం మండలకేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1995, 97, 98లలో తమ తండ్రి నల్లపురామయ్య ఆనాటి మార్కెట్ ధరల ప్రకారం వారి అవసరాలకు అమ్ముతుంటే కొనుగోలు చేశా మన్నారు.వారికి సంబం ధించిన కొనుగోలు పత్రాలు తమ వద్ద ఉన్నాయన్నారు.వాటిని బట్టి వెంటనే విచారణ చేపట్టి తమకు భూ పట్టాలు ఇప్పించాలని నగ్రామస్తులతో కలిసి మంగళవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1995,1998లలో నెమ్మాది సత్తయ్య, నెమ్మాది గోపయ్య, నెమ్మాది వెంకయ్యల కూతుళ్ల వివాహానికి ఆ సంవత్సరంలోనే డబ్బులు కావాలని తమకు వారి భూమి ముగ్గురివి కలిపి 1.19కుంటలు తమను బ్రతిమిలాడితే కొనుగోలు చేయడం జరిగిందని ఎలాంటి అక్రమణకు పాల్పడలేదని అన్నారు. ఓఆర్సీ లేక ఆ భూములు పట్టకాలేదని ఆనాడు తండ్రులు భూములు అమ్మితే ఈనాడు వారి కుమారులు అవి ఇనామ్ భూములను తమను బెదిరిస్తూ రూ.లక్షలు డిమాండ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్నారు.వెంటనే అధికారులు గ్రామానికి విచ్చేసి విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని కోరారు.అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నల్లపు రామయ్య కుమారులు, కోడండ్లు నల్లపు రామ్మూర్తి శేషాలక్ష్మి, పాండయ్య, లింగయ్య, వెంకటేశ్వర్లు వారి సతీమణులు కలమ్మ, పుష్పమ్మ, ధనమ్మ, నెమ్మాది సత్యం, జానకిరాములు, హుస్సేన్, సోమయ్య, నల్లపు రామ్మూర్తి, పాండయ్య, లింగయ్య, వెంకటేశ్వర్లు, శేషాలక్షి, కల, పుష్ప, ధనమ్మ, శ్రీరాములు, కేశవులు, మచ్చ పుల్లయ్య, బ్రమ్మయ్య పాల్గొన్నారు.