Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ గ్రౌండింగ్‌లో పారదర్శకత పాటించాలి
అ సూర్యాపేట కలెక్టర్ వినరుకష్ణారెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలలో దళితబంధు పథకం ద్వారా ఎంపిక చేసిన లబ్దిదారులకు యూనిట్ల మంజూరులో పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని కలెక్టర్ టి. వినరు కష్ణారెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో దళితబంధుపథకం లబ్దిదారులను ఎంపిక చేసిన విధానం, అందచేసే యూనిట్లపై ప్రత్యేక అధికారులు, మండల బందాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్లు ఎస్.మోహన్ రావు, పాటిల్ హేమంత్ కేశవ్‌లతో కలిసి ఆయన మాట్లాడారు.ప్రభుత్వం దళితబంధు పథకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలలో వంద మంది చొప్పున 400 మంది లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టామన్నారు.అలాగే యూనిట్ల గ్రౌండింగ్ పారదర్శకతతో జరగాలని సూచించారు.ఒకే యూనిట్‌ను లబ్దిదారులందరు ఎంపిక చేసుకోకుండా పలు యూనిట్లపై గ్రామాలలో ఆయా శాఖల అధికారులు అవగాహన కల్పిం చాలని సూచించారు.ఎంపికైన లబ్దిదారులకు సత్వరమే బ్యాంక్ అధికారులతో మాట్లాడి వ్యక్తిగత ఖాతాలు తీయించాలని సూచించారు.జిల్లాలో ఆయాశాఖల ద్వారా అమలు చేస్తున్న పధకాలను ప్రత్యేక అధికారులు, మండల స్థాయి బందాలకు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరిం చాలని ఆదేశించారు.లబ్దిదారుల ఆర్థిక బలో పేతానికి నియమించిన అధికారులు నిబద్ధతతో ప్రత్యేక కషి చేయాలని సూచించారు. నియోజకవర్గాల వారీగా నియమించిన ప్రత్యేక అధికారులు, లైన్ డిపార్ట్మెంట్స్, మండలబందాలు సమన్వయంతో కలిసి పని చేయాలని తెలిపారు. దళితబంధుకు సంబం ధించిన రోజువారీ నివేదికలు ఎప్పటికప్పుడు అందచేయాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీని ఆదేశించారు.గ్రామాలలో ఎక్కువగా లబ్దిదారులు కిరణం, ఆటో, కార్, ట్రాక్టర్, గొర్రెలు, మెడికల్ షాప్, టైలరింగ్, కంప్యూటర్ రిపేర్‌షాప్, కోళ్ల పెంపకం, టెంట్‌హౌస్, గేదెలు, చెప్పులషాప్, బిల్డింగ్ సెంట్రింగ్, రైస్ మిల్లులకు సంబంధించిన పలుయూనిట్లపై మక్కువ చూపుతున్నారన్నారు. లబ్దిదారుల గత అనుభవాలు, వాస్తవ పరిస్థితులు అన్ని పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. అనంతరం యూనిట్ల వారీగా కలెక్టర్ సమీక్షిం చారు.ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ సురేష్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శిరీష,డీఆర్డీఏ పీడీ కిరణ్‌కుమార్, డీఏఓ రామారావునాయక్, సీపీఓ జి.వెంకటేశ్వర్లు, గిరిజన సంక్షేమశాఖ అధికారి శంకర్ పాల్గొన్నారు.