Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల స్కాలర్‌షిఫ్‌లు,ఫీజురీయీంబర్స్మెంట్ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ధనియాకుల శ్రీకాంత్‌వర్మ డిమాండ్ చేశారు.మంగళవారం జిల్లాకేంద్రంలో జరిగిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.ప్రభుత్వం విద్యారంగాన్ని, విద్యార్థులను పూర్తిగా విస్మరించిందన్నారు.రెండేండ్లుగా స్కాలర్షిప్లు,ఫీజురీయీంబర్స్మెంట్ బకాయిలు ఉండడంతో విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులకు గురవు తున్నారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల సంక్షేమమే తమ ధ్యేయ మన్నారు.ప్రభుత్వ విద్యాసంస్థల్లో క్లాసురూమ్స్, టాయిలెట్స్, మంచినీరు,విద్యుత్, ల్యాబ్స్, స్కావెంజర్స్ లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.మౌలికవసతులు కల్పించి విద్యా సంస్థలను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరి ంచారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు భానోతు వినోద్ నాయక్, కార్తీక్, సందీప్‌రెడ్డి,శశికుమార్, పవన్, రాహుల్, తేజ పాల్గొన్నారు.