Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హుజూర్‌నగర్‌టౌన్
ఉపాధిహామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తే ఉద్యమం తప్పదని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పోసణబోయిన హుస్సేన్ హెచ్చరిం చారు.మంగళవారం పట్టణ ంలోని అమరవీరుల స్మారక భవనంలో కేంద్ర బడ్జెట్- ఉపాధిహామీకి కోత అనే అంశంపై నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు.అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న ఉపాధిహామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రోజురోజుకు బలహీన పరిచేందుకు కుట్రలు చేస్తుందన్నారు.నాలుగేండ్లుగా ఉపాధిహామీకి కేటాయింపులు తగ్గిస్తుందని విమర్శించారు.2020-21లో రూ.98 వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను కేవలం రూ.73 వేల కోట్లు కేటాయించిందని ఆవేదన వ్యక్తం చేశారు.పట్టణ ప్రాంతాలలో పేదలను ఆదుకునేందుకు అన్ని పట్టణ, మున్సిపల్కేంద్రాల్లో ఉపాధిపనులను కల్పించాలని డిమాండ్ చేశారు.200 రోజులు పనులు కల్పించి రోజుకు రూ. 600 ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు శీలం శ్రీను, నాగేశ్వర్రావు, తురక వీరయ్య, అరవింద్ పాల్గొన్నారు.