Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుంగతుర్తి
మండలకేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థినులు స్నానాలు చేసుకోవడానికి సరిపడా నీటిని నిల్వ చేసుకునే సామర్ధ్యం గల నీటి తొట్లు లేకపోవడం, స్నానాలు చేసే సమ యంలో సరైన మౌలిక వసతులు , ట్యాంకులు లేకపోవడంతో ప్రిన్సిపాల్ దుర్గాభవాని, సిబ్బంది విషయాన్ని సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు, గానుగబండ సర్పంచ్ నల్లు రాం చంద్రారెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆయన బుధవారం మూడునీటితొట్ల పూర్తి నిర్మాణాన్ని వారంరోజుల్లో చేయిస్తా మన్నారు. పేదపిల్లల భవిష్యత్ కోసం సీఎంకేసీఆర్, ఎమ్మెల్యే గాదరికిశోర్కుమార్ గురుకులాలను ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు సాగారన్నారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ దుర్గాభవాని, ఉపాద్యాయులు బింగివెంకటేశ్వర్లు, జీవిత, వేణు, గ్రామ సీనియర్ నాయకులు గుందగాని దుర్గయ్య, శ్రీనివాస్, వెంకటేష్, ఎల్లయ్య, కర్నాకర్ పాల్గొన్నారు.