Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.పున్నయ్య
నవతెలంగాణ-సూర్యాపేట
సమాజాన్ని పట్టి పీడిస్తున్న కులవివక్ష నుండి ప్రజలను కాపాడుకోవాలని,అందుకోసం కులనిర్మూలన జరగాలంటే కుల, మతాంతర వివాహాలను ప్రొత్సహించాలని తెలంగాణ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పున్నయ్య పిలుపునిచ్చారు.ప్రేమికుల దినోత్సవం సందర్భంగా సోమవారం రాత్రి కేవీపీఎస్ జిల్లా కమిటీ ఆద్వర్యంలో హైటెక్కాలనీలోని టీఎస్‌యూటీఎఫ్ ఆఫీసులో జిల్లా ప్రధానకార్యదర్శి కోట గోపి అధ్యక్షతన ఆదర్శ వివాహితుల అభినందన సభ నిర్వహించారు.ఈ సందర్భంగా జంటలకు శాలువా కప్పి సన్మానం చేసి మెమోంటోలు అందజేశారు.ఈసందర్భంగా పున్నయ్య మాట్లాడారు.మనువాద బ్రహ్మణీయ ఆధిపత్య వర్గాల,ఆగాడాలతో దళిత,గిరిజనులు అణగదొక్క బడుతున్నారన్నారు.కులాంతర వివాహం చేసుకున్న జంటలకు రక్షణలేకనే కుల దురహంకారహత్యలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజును కూడా పెట్టుబడిదారులు వ్యాపార ప్రకటనల ద్వారా లాభాలు పొందుతున్నారన్నారు.ఆర్ఎస్ఎస్, భజరంగ్‌దళ్ శక్తులు వెకిలిచేష్టలతో,అసాంఘిక పద్ధతులలో ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు.తద్వారా ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నారు.కులం నిర్మూలించేందుకు కులాంతర వివాహాలు అవసరమన్నారు.రాష్ట్రంలో కుల దురహంకార హత్యలు పెరిగిపోయాయని,చట్టాన్ని పరిరక్షించాల్సిన యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటుందన్నారు.దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.కులాంతర వివాహితులకు రక్షణ చట్టం చేయాలని డిమాండ్ చేశారు.ఉద్యోగ, ఉపాధి కొరకు రిజర్వేషన్లు అమలుచేయాలని డిమాండ్ చేశారు.డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ చెప్పిన విధంగా దళిత,గిరిజనులు చైతన్యవంతమై చదువు అనే విజ్ఞానం ద్వారా సమాజంలో జరుగుతున్న కులవివక్షకు, అఘాయిత్యాలకు, అనాలోచిత నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మర్రి నాగేశ్వరరావు,వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్‌సభ్యులు ములకలపల్లి రాములు,గీతకార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎల్గూరి గోవింద్,డీవైఎఫ్ఐ రాష్ట్ర నాయకులు జె.నర్సింహారావు, కులాంతర వివాహం చేసుకున్న జంటలు పల్లె మణిబాబుజయభారతి,గోగుల శేఖర్పావని, కొండా ఉదరురైసా జంటలు పాల్గొన్నారు.