Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రూ.6కోట్ల విలువైన 20 కార్లు స్వాధీనం
అ లోతైన దర్యాప్తుకు ఆదేశం
అ విలేకర్ల సమావేశంలో ఎస్పీ రెమా రాజేశ్వరి వెల్లడి
నవతెలంగాణ-మిర్యాలగూడ
ఢిల్లీలో ఖరీదైన కార్లను దొంగలించి వాటిని పశ్చిమబెంగాల్లో ఇంజన్ నెంబర్ ఛాయిస్ నెంబర్ మార్చి తెలంగాణకు తరలించి చౌకగా అమ్ముతున్న ఘరానా అంతర్రాష్ట్ర కార్ల దొంగల ముఠాను మిర్యాలగూడ రూరల్ పోలీసులు అరెస్టు చేసినట్టు ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. మంగళవారం సాయంత్రం స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట అంతర్రాష్ట్ర కార్ల దొంగల వివరాలను వెల్లడించారు. నల్గొండ జిల్లా మాల్‌కు చెందిన వీరస్వామి ఇటీవల కాలంలో హైదరాబాద్ చెందిన రామవత్ సిరినాయక్, పరిపూర్ణ చారి వద్ద పశ్చిమ బెంగాల్ నెంబర్ ప్లేట్ గల రెండు కార్లను కొనుగోలు చేశాడని ఆ విషయంలో కొంత మేరకు డబ్బులు చెల్లించి మిగిలిన డబ్బులు ఎన్ఓసీవచ్చిన తర్వాత ఇవ్వమని చెప్పి. ఎన్ఓసీి ఇవ్వకుండా మోసం చేశారని మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.ఈ కేసు విషయంలో ఆ కార్లపై అనుమానం రాగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వద్ద చెక్ చేయగా ఇంజన్, ఛాయిస్ నెంబర్ ట్యాంపరింగ్ గుర్తించారు. ఇట్టి విషయమై టొయోటా హోండాయి షోరూమ్ దగ్గరికెళ్లి పరిశీలించగా అక్కడకూడా ఇంజన్ ఛాయిస్ నెంబర్ ట్యాంపరింగ్ జరిగినట్టు గుర్తించారు. ఒరిజినల్ నెంబర్ తెలుసుకునేందుకు ఓబీడీ అనే ఎలక్ట్రానిక్ డివైస్ ఉపయోగించగా ఆ రెండు వాహనాలు ఢిల్లీకి చెందిన వారిగా గుర్తించారు. ఆ వాహనాలు గత నవంబర్ 10న చోరీకి గురైనట్లు అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆన్లైన్లో ఎఫ్ఐఆర్ డౌన్లోడ్ చేసుకొని సంబంధిత అధికారులకు తెలిపారు. ఈ కేసు విషయంలో లోతుగా విచారించగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన బొప్పా ఘోష్ ఢిల్లీ పరిసర ప్రాంతాలలో దొంగలించిన వాహనాలను పశ్చిమ బెంగాల్‌కు తీసుకెళ్లి అక్కడ నంబర్ ప్లేట్‌ను , ఇంజన్స్ నెంబర్లు మర్చి తెలంగాణకు తరలించి విక్రయిస్తున్నాడు. ఆ వాహనాలకు ఫార్చునర్కు ఎనిమిది నుంచి పది లక్షలు ఇన్నోవాకు నాలుగు నుంచి ఆరు లక్షలు, క్రెటా కారుకు 2 నుంచి 4 లక్షల చొప్పున బొప్పా ఘోష్‌కు ఇచ్చే ఒప్పందం చేసుకుంటాడు. ఆ వాహనాలను ఫార్చునర్ ను 18 నుంచి 20 లక్షలకు, ఇన్నోవా కు 10 నుంచి 12 లక్షలకు, క్రెటాను 4 నుంచి 7 లక్షలకు అమ్మి దానిలో 75శాతం తీసుకొని మిగిలిన డబ్బులు ఎన్ఓసీ తీసుకొని వచ్చిన తర్వాత తీసుకుంటామని నమ్మబలికి వాహనాలను అమ్మేవారు. అమ్మిన వాహనాల్లో 5 నుంచి 8 వాహనాలకు మంచిర్యాల ఆర్టీఏ ఏజెంట్ల ఎండి.షకీల్, ఎండి.షఫీ ఉల్లా సహాయంతో తెలంగాణ నెంబర్ ప్లేట్లు వచ్చేలా చేసి నకిలీ ఎన్ఓసీ ఇచ్చారు. ఇందులో ఐదు వాహనాల నెంబర్లు గుర్తించారు. అందులో ఒక వాహనాన్ని తెప్పించి పరిశీలించగా ఆవాహనం ఢిల్లీలో చోరీకి గురైంనట్టు తేలింది. మిగిలిన వాహనాల గురించి దర్యాప్తు చేస్తున్నారు. మొదటి ముఠా నుండి ఏడు వాహనాలు రెండవ ముఠా నుండి 13 వాహనాలు మొత్తం 20 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు 6 కోట్ల వరకు ఉంటుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మొదటి ముఠాలో మెదక్ జిల్లా తూప్రాన్ మండలం అల్లాపూర్ గ్రామానికి చెందిన శ్రీపతి నరసింహ, హైదరాబాదులోని హస్తినాపురం బీఎన్‌రెడ్డి కాలనీ కి చెందిన కార్ల వ్యాపారం చేసే కోడి మల్ల పరిపూర్ణ చారి, నల్గొండ జిల్లా చింతపల్లి మండలం కొక్కిరాల గ్రామంలోని బొత్య తండాకు చెందిన రమావత్ సిరి నాయక్ లను, రెండవ ముఠాలో ముషీరాబాద్‌కు చెందిన ఉలియత్ అలీఖాన్, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఏరియాకు చెందిన ఎండి.షకీల్, ఎండి.షఫీ ఉల్లాను అరెస్టు చేశారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన బొప్పా ఘోష్, సికింద్రాబాద్ కు చెందిన ఖలీమ్ ఖాన్, హైదరాబాదులోని చిక్కడపల్లికి చెందిన అంజాద్ హుస్సేన్, సికింద్రాబాద్‌కు చెందిన శైలేందర్ సింగ్‌లు పరారీలో ఉన్నారు.అధునాతన టెక్నాలజీని ఉపయోగించి ఒబిడి పోర్టల్ ద్వారా చసిస్ నెంబర్ తెలుసుకొని దానిద్వారా ఢిల్లీ పోలీసు జీఐపీి నెట్ ద్వారా వాహనాల దొంగతనం జరిగినట్టు గుర్తించి ఢిల్లీ పోలీసులను సంప్రదించి స్వీకరించినట్టు తెలిపారు ఈ కేసు విషయంలో లోతుగా దర్యాప్తు జరుపుతున్నామని, అందర్నీ అరెస్టు చేస్తామని ఎస్పీ తెలిపారు.
ఛాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు
ఈ కేసును రూరల్ పోలీసులు ఛాలెంజ్‌గా తీసుకున్నారు. రేమా రాజేశ్వరి పర్యవేక్షణలో డీఎస్పీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో రూరల్ సీఐ ఎం .సత్యనారాయణ, టూటౌన్ సీఐ సురేష్ కుమార్ ,ఎస్సైలు రవికుమార్, వీర శేఖర్ భాస్కర్ రెడ్డి, రాజు సిబ్బందితో కలిసి టీమ్‌గా ఏర్పడి కేసును చాకచక్యంగా ఛేదించారు. ఈ కేజీ చేయించడంలో టెక్నికల్‌గా సహాయపడిన ఆయా కార్ల షోరూం సిబ్బందిని పోలీస్ సిబ్బందిని ఎస్పీ మెమొంటో ఇచ్చి సత్కరించారు.
లారీ దొంగల అరెస్టు
రిమాండ్‌కు తరలింపు
లారీని దొంగలించిన కేసులో ఇద్దర్ని అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్టు ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు .మంగళవారం సాయంత్రం స్థానికరూరల్ పోలీస్ స్టేషన్లో ఆమె విలేకర్లకు వివరాలు వెల్లడించారు. గత నెల 22న మిర్యాలగూడ లారీ అసోసియేషన్ వద్ద ్ర 05 ఙa 4335 గల లారీ దొంగలించారు. లారీ యజమాని నాగేశ్వరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. లారీకి జీపీిఏ ఉన్నట్టు గుర్తించి 20 కిలోమీటర్లు దాటిన తర్వాత ఆ జీపీఏను తొలగించి హైదరాబాద్‌లోని ఇబ్రహీంపట్నం కు తరలించి కలర్ మర్చి ఇతరులకు అమ్మారు. ఈ విషయంలో మిగిలిన డబ్బులు చెల్లింపు చేసేందుకు మిర్యాలగూడకు రమ్మని కొనుగోలుదారులు కోరగా లారీని తీసుకుని వస్తుండగా మండలంలోని శ్రీనివాస్ నగర్‌వద్ద లారితో పాటు తూర్పుగోదావరి జిల్లా తిమ్మాపురానికి చెందిన ఆచంట గంగాధరరావు అలియాస్ గౌరీశంకర్ అలియాస్ శ్రీనివాసరావు షేక్ అబ్దుల్ రహీం, షేక్ హాజీ, కప్పనూరి గణేష్ లను అరెస్టు చేశారు.కోడి మల్ల పరిపూర్ణ చారి పరారీలో ఉన్నాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా గంగాధర్ ఉన్నాడు.ఇతను గతంలో రెండు లారీలను కొనుగోలు చేసి ఫైనాన్స్ కట్టకపోవడంతో లారీలను జప్తు చేశారని అప్పటి నుండి చెడు అలవాట్లకు బానిసై తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని ఆశ తో దొంగతనాలు చేస్తున్నాడు. ఇతనిపై 20 కి పైగా కేసులు ఉన్నాయి. చివరిసారిగా నరసరావుపేటలో దొంగతనం చేసి జైలుకెళ్లి వచ్చాడు. ఈ కేసును ఛేదించిన డీఎస్పీ వెంకటేశ్వరరావు రూరల్ సీఐ సత్యనారాయణ టూటౌన్ సీఐ సురేష్ ఆయా పోలీస్స్టేషన్ల ఎస్ఐలను, పోలీసు సిబ్బందిని అభినందించారు