Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి
నవతెలంగాణ-మిర్యాలగూడ
లచ్చయ్య మృతి ఉపాధ్యాయ లోకానికి తీరని లోటని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చావా రవి అన్నారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో టీఎస్ యూటీఎఫ్ నాయకులు గుండెపూరి లచ్చయ్య సంస్మరణ సభ నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమించారని కొనియాడారు. ఉపాధ్యాయుల కోసం నిరంతరం పని చేశారని, ఆయన చేసిన సేవలు సంఘం ఎప్పటికీ మరువలేనిదని పేర్కొన్నారు. కుటుంబానికి కంటే సంఘానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారని, కొత్త కార్యకర్తలను తయారు చేయడంలో ఆయన ఎంతో కృషి చేశారన్నారు. ఆయన ఆశయ సాధన కోసం యూటీఎఫ్ నాయకులు పాటుపడాలని కోరారు. యూటీఎఫ్ జిల్లా నాయకులు శ్రీనివాసాచారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, ఎంఈఓ బాలాజీ నాయక్, మంగ్యా నాయక్, జిల్లా అధ్యక్షులు ఎడ్ల సైదులు, నాయకులు నాగమణి శ్రీనివాస్ రెడ్డి, జేవీవీ జిల్లా కార్యదర్శి రాంపాటి అమరయ్య పాల్గొన్నారు.