Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఆయిల్ఫెÛడ్ చైర్మెన్ కంచర్ల రామకష్ణా రెడ్డి
నవతెలంగాణ- సంస్థాన్‌నారాయణపురం
విరివిగా ఆయిల్ఫామ్ మొక్కలు నాటి అధిక లాభాలు పొందాలని రాష్ట్ర ఆయిల్‌ఫెడ్ చైర్మెన్ కంచర్ల రామకష్ణా రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని గంగమూల తండలోని లక్ష్మీనారాయణ వ్యవసాయ క్షేత్రంలో రాష్ట్ర పామ్ఆయిల్ ఫెడరేషన్, పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు అవగాహనా సదస్సులో రామకష్ణా రెడ్డి మాట్లాడారు. రైతులు ఆయిల్ ఫామ్ మొక్కల పెంపకంతో ఎకరాకు 57 మొక్కలు నాటాలని ఒక మొక్కకు రూ.35 చెల్లిస్తే 60శాతం సబ్సిడీ తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. పెంచిన మొక్కలను అయిల్‌ఫెడ్ కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్లో ఇబ్బందులు ఉండవన్నారు. దీనివల్ల రైతులకు ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ ఎంపీపీ ఉమా ప్రేమ్ చందర్ రెడ్డి, జెడ్పీటీసీ భానుమతి వెంకటేశం, చౌటుప్పల్ ఎంపీపీ తాండూర్ వెంకట్ రెడ్డి, సింగిల్‌విండో చైర్మెన్ జక్కిడి జంగారెడ్డి, చింతల దామోదర్ రెడ్డి నారాయణపురం మండలం సర్పంచులు ఎంపీటీసీలు చౌటుప్పల్ మండలం సర్పంచులు, ఎంపీటీసీలు, రైతులు పాల్గొన్నారు.